Telugu Global
NEWS

మహిళా వ్యతిరేకి చంద్రబాబు... హోరెత్తిన అసెంబ్లీ

మహిళల భద్రతకు కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా చంద్రబాబు, టీడీపీ సభ్యులు అడ్డుపడడంపై ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. మహిళల భద్రతపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా అడ్డుపడ్డారు. మహిళల భద్రత అంశంపై కాకుండా ఉల్లి ధరలపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. టీడీపీ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రజనీ మండిపడ్డారు. మహిళల భద్రత అంశంపై చర్చ జరిగితే…. […]

మహిళా వ్యతిరేకి చంద్రబాబు... హోరెత్తిన అసెంబ్లీ
X

మహిళల భద్రతకు కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా చంద్రబాబు, టీడీపీ సభ్యులు అడ్డుపడడంపై ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. మహిళల భద్రతపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా అడ్డుపడ్డారు.

మహిళల భద్రత అంశంపై కాకుండా ఉల్లి ధరలపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా టీడీపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు.

టీడీపీ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రజనీ మండిపడ్డారు. మహిళల భద్రత అంశంపై చర్చ జరిగితే…. ఐదేళ్లలో టీడీపీ నేతలు మహిళలపై చేసిన ఘోరాలు కూడా ప్రస్తావనకు వస్తాయన్న భయంతోనే చంద్రబాబు అడ్డుపడుతున్నాడని విమర్శించారు.

మహిళల భద్రతపై 40 ఏళ్ల ఇండస్ట్రీ వ్యక్తికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసేవారన్నారు. చంద్రబాబుకు మహిళల భద్రతపై బాధ్యత లేదా అని ప్రశ్నించారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నడిపింది చంద్రబాబు ప్రభుత్వం అని విమర్శించారు. చంద్రబాబుకు ఒక ఆడబిడ్డ ఉంటే ఆడపిల్లల బాధేంటో తెలిసేదన్నారు.

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై చర్చిస్తుంటే అడ్డుకోవడం సరైన పద్దతి కాదన్నారు. ఉల్లి ధరలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా గొడవ చేయడం సరికాదన్నారు. అయినా చంద్రబాబు తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేదు. దాంతో వైసీపీ సభ్యులు మహిళా వ్యతిరేకి చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు.

First Published:  9 Dec 2019 7:19 AM IST
Next Story