Telugu Global
NEWS

రెండో టీ-20కి వానగండం

వరుణుడి దయే అంటున్న కేరళ అభిమానులు భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా ..తిరువనంతపురం వేదికగా ఈరోజు జరగాల్సిన రెండో టీ-20కి వానగండం పొంచిఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు..తిరువనంతపురం వేదికగా మూడోసారి జరుగనున్న ఈ టీ-20మ్యాచ్ కోసం కేరళ క్రికెట్ అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. తమ రాష్ట్ర్రానికి చెందిన సంజు శాంసన్ 2015 తర్వాత తిరిగి తుదిజట్టులో ఆడే అవకాశం ఉందని ఆశపడుతున్నారు. కుండపోతంగా వర్షం కురిసినా…కేవలం 30 నిముషాల వ్యవధిలోనే గ్రౌండ్ […]

రెండో టీ-20కి వానగండం
X
  • వరుణుడి దయే అంటున్న కేరళ అభిమానులు

భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా ..తిరువనంతపురం వేదికగా ఈరోజు జరగాల్సిన రెండో టీ-20కి వానగండం పొంచిఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

మరోవైపు..తిరువనంతపురం వేదికగా మూడోసారి జరుగనున్న ఈ టీ-20మ్యాచ్ కోసం కేరళ క్రికెట్ అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

తమ రాష్ట్ర్రానికి చెందిన సంజు శాంసన్ 2015 తర్వాత తిరిగి తుదిజట్టులో ఆడే అవకాశం ఉందని ఆశపడుతున్నారు.
కుండపోతంగా వర్షం కురిసినా…కేవలం 30 నిముషాల వ్యవధిలోనే గ్రౌండ్ ను మ్యాచ్ కు సిద్ధం చేసే సదుపాయాలు తమకు ఉన్నాయని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం క్యూరేటర్ బిజు ధీమాగా చెబుతున్నారు.

తిరువనంతపురం స్టేడియం గ్రౌండ్ అడుగుభాగంలో 3 వేల 500ల పైపులు అమర్చి ఉన్నాయని, భారీగావర్షం కురిసినా..ఆ నీటినిలాగేసే సామర్థ్యం వీటికి ఉందని గ్రౌండ్ సిబ్బంది చెబుతున్నారు.

స్టేడియం కెపాసిటీకి తగిన మొత్తం టికెట్లు ఇప్పటికే హాటుకేకుల్లా అమ్ముడుపోడంతో కేరళ క్రికెట్ సంఘం సంతోషంగా ఉన్నా.. వరుణగండంతో అభిమానులు మాత్రం..బిక్కుబిక్కుమంటూ ఆకాశం వైపు చూస్తున్నారు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది.

First Published:  8 Dec 2019 5:00 AM IST
Next Story