అల్లు అరవింద్ చేతికి అర్జున్ సురవరం
అర్జున్ సురవరం సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకోలేదు. నెట్ ఫ్లిక్స్ కు కూడా వెళ్లలేదు. చివరికి జీ5, సన్ నెక్ట్స్ లాంటి యాప్స్ కూడా దక్కించుకోలేదు. అవును.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అల్లు అరవింద్ దక్కించుకున్నారు. త్వరలోనే ఓటీటీ (ఓవర్ ది టాప్) సెగ్మెంట్ లోకి ఎంటరవుతున్నారు అల్లు అరవింద్. కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ పెట్టబోతున్నారు. ఆ యాప్ […]
అర్జున్ సురవరం సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకోలేదు. నెట్ ఫ్లిక్స్ కు కూడా వెళ్లలేదు. చివరికి జీ5, సన్ నెక్ట్స్ లాంటి యాప్స్ కూడా దక్కించుకోలేదు. అవును.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అల్లు అరవింద్ దక్కించుకున్నారు.
త్వరలోనే ఓటీటీ (ఓవర్ ది టాప్) సెగ్మెంట్ లోకి ఎంటరవుతున్నారు అల్లు అరవింద్. కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ పెట్టబోతున్నారు. ఆ యాప్ కోసం అర్జున్ సురవరం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేశారు. తాజా సమాచారం ప్రకారం 2 కోట్ల 50 లక్షల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దూసుకుపోతోంది. సినిమా చిన్నదైనా పెద్దదైనా అన్నింటినీ ఇది దక్కించుకుంటోంది. ఆ తర్వాత స్థానంలో నెట్ ఫ్లిక్స్, జీ5 ఉన్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా అల్లు అరవింద్ కు చెందిన యాప్ వస్తోంది. ఈ యాప్ కు అర్హ మీడియా అనే పేరు పెట్టాలనుకుంటున్నారు. 2020లో ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.