వైసీపీలో చేరిన మస్తాన్‌రావు
కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బీదా మస్తాన్‌రావు వైసీపీలో చేరారు. నిన్న టీడీపీకి రాజీనామా చేసిన మస్తాన్‌రావు… తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ పాలనలో భాగస్వామిగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరినట్టు మస్తాన్‌రావు చెప్పారు. పేదవాడికి ఇంగ్లీష్ చదువులు అందించాలన్న ఆలోచన చాలా గొప్పదన్నారు . తండ్రికి తగ్గ తనయుడిగా జగన్‌మోహన్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. పార్టీ అభివృద్ధి కోసం సైనికుడిలా పనిచేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు […]
కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బీదా మస్తాన్‌రావు వైసీపీలో చేరారు. నిన్న టీడీపీకి రాజీనామా చేసిన మస్తాన్‌రావు… తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
జగన్ పాలనలో భాగస్వామిగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరినట్టు మస్తాన్‌రావు చెప్పారు. పేదవాడికి ఇంగ్లీష్ చదువులు అందించాలన్న ఆలోచన చాలా గొప్పదన్నారు . తండ్రికి తగ్గ తనయుడిగా జగన్‌మోహన్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. పార్టీ అభివృద్ధి కోసం సైనికుడిలా పనిచేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతోందన్నారు.
విద్యా-వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పెను మార్పులకు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ అంశమన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
1983 నుంచి టీడీపీలో క్రియాశీలంగా ఉంటూ వచ్చానని… ఏ పార్టీలో ఉన్నా క్రమశిక్షణతో నడుచుకోవడం తనకు అలవాటని…ఇకపై వైసీపీ పట్ల అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. ఇన్నేళ్ల రాజకీయంలో ఏ ఒక్కరితోనూ వ్యక్తిగత వైరం లేదన్నారు మస్తాన్‌రావు. కావలి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలోనే వైసీపీలో చేరడం విశేషం.