టీడీపీకి భారీ షాక్
నెల్లూరు టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత బీదా మస్తాన్ రావు టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబునాయుడికి పంపించారు. సుమారు రెండు దశాబ్దాలుగా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న మస్తాన్‌రావు తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న భావనతో ఉన్నారు. ఇటీవల మత్స్యకార దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి సభలో బీదా మస్తాన్‌రావు పాల్గొనడంతో టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. జగన్‌మోహన్ రెడ్డితో ఆరోజు కాసేపు ముచ్చటించారు. దాంతో ఆయన పార్టీ మారుతారన్న […]
నెల్లూరు టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత బీదా మస్తాన్ రావు టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చంద్రబాబునాయుడికి పంపించారు. సుమారు రెండు దశాబ్దాలుగా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న మస్తాన్‌రావు తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న భావనతో ఉన్నారు.
ఇటీవల మత్స్యకార దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి సభలో బీదా మస్తాన్‌రావు పాల్గొనడంతో టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. జగన్‌మోహన్ రెడ్డితో ఆరోజు కాసేపు ముచ్చటించారు. దాంతో ఆయన పార్టీ మారుతారన్న చర్చ మొదలైంది. తాను స్వతహాగా మత్స్యకార రంగంలో ఉన్నానని… అందుకే జగన్‌మోహన్ రెడ్డి తనను ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆహ్వానించారని… నాడు బీదా మస్తాన్‌రావు చెప్పారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్‌రావు మధ్య చాలా కాలం నుంచి మంచి స్నేహం ఉంది. విజయసాయిరెడ్డితోనూ చర్చలు సఫలం అయిన తర్వాతే బీదా మస్తాన్‌రావు టీడీపీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.
2009లో కావలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీదా మస్తాన్‌రావు… ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కావలి నుంచి వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు.