బస్సు చార్జీలను పెంచిన ఏపీ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచగా ఏపీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనించింది. ఏటా ఆర్టీసీకి 12 వందల కోట్ల నష్టం వస్తోందని మంత్రి పేర్ని నాని వివరించారు. నష్టాల ఊబి నుంచి ఆర్టీసిని గట్టెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పల్లెవెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్‌కు 10పైసలు పెంచుతున్నట్టు చెప్పారు. మిగిలిన సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు వివరించారు. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమలులోకి […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచగా ఏపీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనించింది.
ఏటా ఆర్టీసీకి 12 వందల కోట్ల నష్టం వస్తోందని మంత్రి పేర్ని నాని వివరించారు. నష్టాల ఊబి నుంచి ఆర్టీసిని గట్టెక్కించాల్సిన అవసరం ఉందన్నారు.
పల్లెవెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్‌కు 10పైసలు పెంచుతున్నట్టు చెప్పారు. మిగిలిన సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు వివరించారు.
పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి అన్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ మీద 6వేల 700 కోట్ల అప్పు ఉందన్నారు. దీన్ని తీర్చడంతోపాటు ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పడం లేదన్నారు.
2015లో చంద్రబాబు హయాంలో బస్సు చార్జీలు పెంచారని మంత్రి పేర్నినాని గుర్తు చేశారు. బస్సు చార్జీలను పెంచడం అన్నది ఆర్టీసీని బతికించడం కోసం చేసే ప్రయత్నమేనన్నారు మంత్రి పేర్నినాని.