ప్రకాశ్ రెడ్డి తలే కాదు ఏ రెడ్డి తలనైనా నరికేస్తాం " పవన్ సమక్షంలో జనసేన నేత
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విధ్వేషపూరిత ప్రసంగాలు… ఆ పార్టీ నేతలపైనా తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. వైసీపీ నేతల తలలు నరుకుతామంటూ పవన్ కల్యాణ్ సమక్షంలోనే హెచ్చరికలు చేశారు జనసేన నేత ఒకరు. మదనపల్లిలో జనసేన నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు సమక్షంలోనే నేతలు వీరావేశంతో ప్రసంగాలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత సాకే పవన్ కుమార్ విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. మీరు ఆదేశిస్తే […]

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విధ్వేషపూరిత ప్రసంగాలు… ఆ పార్టీ నేతలపైనా తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. వైసీపీ నేతల తలలు నరుకుతామంటూ పవన్ కల్యాణ్ సమక్షంలోనే హెచ్చరికలు చేశారు జనసేన నేత ఒకరు.
మదనపల్లిలో జనసేన నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు సమక్షంలోనే నేతలు వీరావేశంతో ప్రసంగాలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత సాకే పవన్ కుమార్ విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
మీరు ఆదేశిస్తే రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి తల నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఒకసారి అనుమతి ఇస్తే ప్రకాశ్ రెడ్డి తలే కాదు… రాష్ట్రంలో ఏ రెడ్డి తలనైనా నరికేస్తామంటూ మురళీ వ్యాఖ్యానించారు.
సాకే పవన్ కుమార్ ఇలా తలలు నరుకుతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నా…. పవన్ కల్యాణ్ ఏమాత్రం వారించలేదు. సాకే పవన్ కుమార్ ప్రసంగానికి ఇతర నేతలతో పాటు పవన్ కల్యాణ్ కూడా చప్పట్లు కొట్టారు.
ఇంత బహిరంగంగా ఎమ్మెల్యే తల నరికేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన సాకే పవన్ కుమార్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.