మీ ఇంట్లో జరిగినా ఇలాగే మాట్లాడుతావా.... పవన్ రేపిస్ట్ కామెంట్స్‌పై సుమన్ ఫైర్
రేప్‌లు చేసిన వారిని ఉరి తీసే హక్కు ఎవరికీ లేదని… వారిని నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సలహాపై నటుడు సుమన్ తీవ్రంగా స్పందించారు. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని మాట్లాడడం చాలా దారుణమైన అంశమన్నారు. ఇలాంటి ఘటనలు పవన్ కల్యాణ్ ఇంట్లో జరిగినా ఇలాగే మాట్లాడుతారా అని ప్రశ్నించారు. గుంటూరు వచ్చిన సుమన్… ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధితుల ఆవేదన ఏంటో అర్థం చేసుకుని మాట్లాడాలని […]
రేప్‌లు చేసిన వారిని ఉరి తీసే హక్కు ఎవరికీ లేదని… వారిని నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సలహాపై నటుడు సుమన్ తీవ్రంగా స్పందించారు. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని మాట్లాడడం చాలా దారుణమైన అంశమన్నారు.
ఇలాంటి ఘటనలు పవన్ కల్యాణ్ ఇంట్లో జరిగినా ఇలాగే మాట్లాడుతారా అని ప్రశ్నించారు. గుంటూరు వచ్చిన సుమన్… ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధితుల ఆవేదన ఏంటో అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని సుమన్ ప్రశ్నించారు.
రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ దిశ ఉదంతంపై స్పీచ్ ఇస్తూ ”అత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. చంపే హక్కు మాత్రం ఎవరికీ లేదు’’ అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఉలిక్కిపడ్డారు.