టీటీడీలో అన్యమత ప్రచారం హిందువుల పనే... గొడవలు పెడుతోంది హిందూ నేతలే
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నాయకులేనని ఆరోపించారు. మతాల మధ్య గొడవలు పెట్టేది హిందూ నాయకులేనని వ్యాఖ్యానించారు. ఇతర మతాల వారు గొడవలు పెట్టే పనులు చేయరని అభిప్రాయపడ్డారు. టీటీడీలో అన్యమత ప్రచారం చేస్తోంది కూడా హిందువులేనని పవన్ కల్యాణ్ ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. హిందూ నాయకుల ప్రేరణ లేకుండా ఇలాంటి ప్రచారాలు […]

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నాయకులేనని ఆరోపించారు. మతాల మధ్య గొడవలు పెట్టేది హిందూ నాయకులేనని వ్యాఖ్యానించారు. ఇతర మతాల వారు గొడవలు పెట్టే పనులు చేయరని అభిప్రాయపడ్డారు.
టీటీడీలో అన్యమత ప్రచారం చేస్తోంది కూడా హిందువులేనని పవన్ కల్యాణ్ ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. హిందూ నాయకుల ప్రేరణ లేకుండా ఇలాంటి ప్రచారాలు జరిగే అవకాశమే లేదన్నారు.
తాను చిన్నప్పటి నుంచి ఒకటే వింటున్నానని… దేశంలో సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందువులు మాత్రమేనని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మిగిలిన మతాల వారు సెక్యులరిజానికి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టడం లేదన్నారు.