బాబు బండారం బయటపెట్టిన విజయసాయిరెడ్డి
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడిందని వైసీపీ తొలి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కూడా పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి కటారియా కీలక అంశం బయటపెట్టారు. చంద్రబాబు హయంలో భారీగా అదనపు చెల్లింపులు జరిగిన మాట వాస్తవమేనని వెల్లడించారు. 2015-16లో పోలవరం కాంట్రాక్టర్లకు అదనంగా రెండు వేల 346 కోట్లు […]
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడిందని వైసీపీ తొలి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కూడా పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి కటారియా కీలక అంశం బయటపెట్టారు.
చంద్రబాబు హయంలో భారీగా అదనపు చెల్లింపులు జరిగిన మాట వాస్తవమేనని వెల్లడించారు. 2015-16లో పోలవరం కాంట్రాక్టర్లకు అదనంగా రెండు వేల 346 కోట్లు చెల్లించారని వివరించారు. అడ్వాన్స్ చెల్లింపుల కిందే ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. అసలు నిర్మాణమే ప్రారంభం కానీ పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు ఏకంగా 787 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అడ్వాన్స్‌గా చెల్లించినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు.
2,346 కోట్ల మేర అదనపు చెల్లింపులు జరిగినట్టు నిపుణుల కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందని… ఈనేపథ్యంలో ఈ చెల్లింపులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరిశీలన చేస్తోందని కేంద్రమంత్రి వివరించారు.
ఈ చెల్లింపులు ఏ ప్రాతిపదికన చేశారు, ఎవరెవరికి ఎంత చెల్లించారు… ఆ సొమ్ము ఇప్పుడు ఎవరి జేబుల్లో ఉంది? అన్న దానిపై విజిలెన్స్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వివరించారు.