జగన్ టార్గెట్ గా.... తిరుమలేషుడిపై పవన్ రాజకీయ విమర్శలు
పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వెనుకాల చంద్రబాబు ప్రోత్సాహమో లేక ఇంకేదో తెలియదు కానీ అధికార వైసీపీ సర్కార్ ను టార్గెట్ గా, సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఆయననే నవ్వుల పాలు చేస్తున్నాయి. తిరుపతిలో జరిగిన జనసేన కార్యకర్తల సభలో పవన్ కల్యాణ్ నోరుజారాడు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతీ దానికి వైసీపీ రంగులను వేస్తున్నారని.. చివరకు తిరుమల శ్రీవారు కొలువైన ఏడుకొండల […]
పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వెనుకాల చంద్రబాబు ప్రోత్సాహమో లేక ఇంకేదో తెలియదు కానీ అధికార వైసీపీ సర్కార్ ను టార్గెట్ గా, సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఆయననే నవ్వుల పాలు చేస్తున్నాయి.
తిరుపతిలో జరిగిన జనసేన కార్యకర్తల సభలో పవన్ కల్యాణ్ నోరుజారాడు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతీ దానికి వైసీపీ రంగులను వేస్తున్నారని.. చివరకు తిరుమల శ్రీవారు కొలువైన ఏడుకొండల వాడికి కూడా వేస్తారు కావచ్చు…. అంటూ సెటైర్లు వేశారు.
నిజానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరుమలేషుడిపై ఏ వ్యక్తి, భక్తుడు కూడా కామెంట్ చేయడానికి, సెటైర్లు వేయరు. ఆ దేవదేవుడికి ప్రార్థనలు తప్పితే ఇలాంటి పనులు చేయరు. కానీ పవన్ కళ్యాణ్ తాజాగా తిరుమలేషుడిని కూడా వదలకుండా జగన్ సర్కారును ఎండగట్టేందుకు తిట్టిపోయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.
రాజకీయాన్ని తిరుమల శ్రీవారి దేవుడికి అంటగట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలేషుడిపై పవన్ చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.