టెస్ట్ క్రికెట్లో 73 సంవత్సరాల ప్రపంచ రికార్డు తెరమరుగు
అత్యంత వేగంగా 7 వేల పరుగుల స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు స్టీవ్ స్మిత్…73 సంవత్సరాల రికార్డును అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 7వేల పరుగుల సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. అడిలైడ్ ఓవల్ లో వేదికగా పాక్ తో జరుగుతున్న డే-నైట్ టెస్టులో స్మిత్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా 1946 లో ఇంగ్లండ్ […]
- అత్యంత వేగంగా 7 వేల పరుగుల స్టీవ్ స్మిత్
టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు స్టీవ్ స్మిత్…73 సంవత్సరాల రికార్డును అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 7వేల పరుగుల సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.
అడిలైడ్ ఓవల్ లో వేదికగా పాక్ తో జరుగుతున్న డే-నైట్ టెస్టులో స్మిత్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా 1946 లో ఇంగ్లండ్ క్రికెటర్ వాలీ హామండ్ నెలకొల్పిన రికార్డును స్మిత్ అధిగమించాడు.
హామండ్ 136 ఇన్నింగ్స్ లో 7 వేల పరుగుల మైలురాయిని చేరితే…స్టీవ్ స్మిత్ మాత్రం కేవలం 126 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.
భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 134 ఇన్నింగ్స్ లో 7వేల పరుగుల రికార్డు సాధించడం విశేషం.
మాస్టర్ సచిన్ టెండుల్కర్ 136 ఇన్నింగ్స్ లోనూ, సర్ గారీ ఫీల్డ్ సోబర్స్, కుమార సంగక్కర, విరాట్ కొహ్లీ తలో 138 ఇన్నింగ్స్ లోనూ 7వేల పరుగులు సాధించగలిగారు.
డాన్ ను మించిన స్టీవ్
డాన్ బ్రాడ్మన్ 52 టెస్టుల్లో 6 వేల 996 పరుగులు సాధిస్తే…స్టీవ్ స్మిత్ 70 టెస్టుల్లో 7వేల పరుగులు సాధించాడు. ఆస్ట్ర్రేలియా టెస్ట్ క్రికెటర్లలో గ్రెగ్ చాపెల్ 7వేల 110 పరుగులు, రికీ పాంటింగ్ 13వేల 378 పరుగుల రికార్డులను స్టీవ్ స్మిత్ అధిగమించాల్సి ఉంది.