Telugu Global
CRIME

తండ్రిపై మరోసారి ఫిర్యాదు చేసిన అమృత... మారుతీరావు అరెస్ట్

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య కేసులో బెయిల్‌పై వచ్చిన మారుతీరావు మరోసారి అరెస్ట్ అయ్యారు. కుమార్తె అమృత ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. మారుతీరావుతో పాటు కరీం, వెంకటేశ్వరరావు అనే వ్యక్తులపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మారుతీరావును కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 11న మారుతీరావు … అమృత ఇంటికి వెంకటేశ్వరరావును మధ్యవర్తిగా పంపించారు. ఆస్తి పంపకాలపై చర్చల కోసం పంపించారు. దాంతో ఆస్తి పేరుతో తనను ప్రలోభపెట్టేందుకు […]

తండ్రిపై మరోసారి ఫిర్యాదు చేసిన అమృత... మారుతీరావు అరెస్ట్
X

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య కేసులో బెయిల్‌పై వచ్చిన మారుతీరావు మరోసారి అరెస్ట్ అయ్యారు. కుమార్తె అమృత ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు.

మారుతీరావుతో పాటు కరీం, వెంకటేశ్వరరావు అనే వ్యక్తులపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మారుతీరావును కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది.

ఈనెల 11న మారుతీరావు … అమృత ఇంటికి వెంకటేశ్వరరావును మధ్యవర్తిగా పంపించారు. ఆస్తి పంపకాలపై చర్చల కోసం పంపించారు. దాంతో ఆస్తి పేరుతో తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మిర్యాలగూడ పీఎస్‌లో అమృత ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  1 Dec 2019 3:30 AM IST
Next Story