Telugu Global
NEWS

లియాండర్ పేస్ సరికొత్త ప్రపంచ రికార్డు

46 ఏళ్ల వయసులో 44వ డబుల్స్ గెలుపు భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ లియాండర్ పేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 46 ఏళ్ల లేటు వయసులో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆటకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని మరోసారి నిరూపించాడు. ఏడాది విరామం తర్వాత భారత డేవిస్ కప్ జట్టులో చోటు సంపాదించి…చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఆసియా-ఓషియానా గ్రూప్-1 పోటీలో కీలక విజయం అందించాడు.డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక […]

లియాండర్ పేస్ సరికొత్త ప్రపంచ రికార్డు
X
  • 46 ఏళ్ల వయసులో 44వ డబుల్స్ గెలుపు

భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ లియాండర్ పేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 46 ఏళ్ల లేటు వయసులో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆటకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని మరోసారి నిరూపించాడు.

ఏడాది విరామం తర్వాత భారత డేవిస్ కప్ జట్టులో చోటు సంపాదించి…చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఆసియా-ఓషియానా గ్రూప్-1 పోటీలో కీలక విజయం అందించాడు.డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

అలుపెరుగని యోధుడు…

భారత ఎవర్ గ్రీన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. డేవిస్ కప్ డబుల్స్ చరిత్రలోనే అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

నూర్- సుల్తాన్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన రెండురోజుల….ఆసియా-ఓషియానా గ్రూప్-1 డేవిస్ కప్ డబుల్స్ మ్యాచ్ లో….జీవన్ నెడుంజెళియన్ జంటగా తనజట్టుకు కీలక విజయం అందించాడు.

పాక్ జోడీ రెహ్మాన్- షోయబ్ లతో ముగిసిన ఏకపక్ష సమరంలో…పేస్ జోడీ 6-1, 6-3 తో విజయం సాధించడంతోనే…సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది.

1990 – 2019

ప్రస్తుత భారత డేవిస్ కప్ శిక్షకుడు జీషన్ అలీతో కలసి..1990లో తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన లియాండర్ పేస్…గత 29 సంవత్సరాలుగా…భారత జట్టులో సభ్యుడిగా కొనసాగుతూనే వస్తున్నాడు.

అంతేకాదు…46 ఏళ్ల లేటు వయసులో సైతం…కుర్రాడిలా రాణిస్తూ ….ప్రతిభకు, అంకితభావానికి… వయసుతో ఏమాత్రం పనిలేదని చాటిచెప్పాడు.

46 ఏళ్ల వయసులో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడంతో పాటు..ఇప్పటికే 57 డేవిస్ కప్ మ్యాచ్ లు ఆడిన పేస్.. 44 విజయాలతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

డేవిస్ కప్ డబుల్స్ లో ఇప్పటి వరకూ 44 విజయాలు సాధించడం ద్వారా…ఇటలీ ప్లేయర్ నికోలా పీట్రాంజెలీ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును పేస్…… తెరమరుగు చేశాడు.

డేవిస్ కప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన డబుల్స్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టెన్నిస్ కెరియర్ ప్రారంభించిన పేస్…46 ఏళ్ల వయసులోనూ నవతరం ఆటగాళ్లను మించిన ఉత్సాహంతో పోటీపడటం అపూర్వం మాత్రమే కాదు…అసాధారణం కూడా….

First Published:  1 Dec 2019 3:31 AM IST
Next Story