జగన్ వ్యూహం ఇదే... అందుకే అలా వెళుతున్నారు
నేను విన్నాను…నేను ఉన్నాను… అంటూ వేలాది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఇది స్వపక్షంలో ఉన్న వారికీ మింగుడు పడటం లేదు. ఆర్థికంగా దీనావస్థలో ఉన్న పరిస్థితుల్లో సంక్షేమం కోసం పెద్ద పీట వేయడం అనేది ప్రతిపక్షానికి మింగుడు పడకపోతుంటే, అధికార పక్షంలోని వారికీ అంతుబట్టకుండా ఉంది. నేను మాట ఇచ్చాను..చేసి తీరాల్సిందే.. అని జగన్ చెప్పే మాటలు విని ఉన్నతాధికారులూ, […]
నేను విన్నాను…నేను ఉన్నాను… అంటూ వేలాది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు.
అయితే ఇది స్వపక్షంలో ఉన్న వారికీ మింగుడు పడటం లేదు. ఆర్థికంగా దీనావస్థలో ఉన్న పరిస్థితుల్లో సంక్షేమం కోసం పెద్ద పీట వేయడం అనేది ప్రతిపక్షానికి మింగుడు పడకపోతుంటే, అధికార పక్షంలోని వారికీ అంతుబట్టకుండా ఉంది. నేను మాట ఇచ్చాను..చేసి తీరాల్సిందే.. అని జగన్ చెప్పే మాటలు విని ఉన్నతాధికారులూ, మంత్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎలా చేస్తారు.. ఏవిధంగా ముందుకు వెళతారు అని వారు చర్చించుకునే సందర్భాలే అధికం.
వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రి కావడం అనేది యాదృచ్చికం కాదు. దీనికోసం ఆయన తన జీవితాన్ని ఫణంగా పెటారు. కాంగ్రెస్ పార్టీని కాలదన్ని స్వయంగా పార్టీని ఏర్పాటు చేయడం అనేది సాహసోపేతమైన చర్యే. హేమా హేమీలకే ఇది సాధ్యం కాలేదు. దీనికోసం విలువైన జీవితాన్ని ఆయన జైల్లో గడపాల్సివ వచ్చింది.
అనంతరం వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి నిత్యం ప్రజల్లో ఉండటానికి ఆయన సిద్దమయ్యారు. పార్టీలు, కులాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆయన అందర్నీ కలిశారు. అన్ని సమస్యలూ విన్నారు. వాటిని మదిలో పెట్టుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక వాటిని నవరత్నాల పేరిట నెరవేరుస్తున్నారు.
ఐదేళ్లలో చేయాల్సిన పనులన్నీ ఆరునెలల్లో చేసేస్తే మిగతా రోజుల్లో ఏమి చేస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ వీటికి అతీతంగా జగన్ తన పని తాను చేసుకుపోతున్నారు.
జగన్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండాలని కోరుకుంటున్నారు. పారదర్శకతను పాటించాలనుకుంటున్నారు. ప్రజల పక్షాన నిలబడి, వారికి కావాల్సింది ఇచ్చి అధికారంలో కొనసాగాలనుకుంటున్నారు. అందుకే సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చినా ఐదేళ్ల పాలనా కాలంలో సగం కూడా నెరవేర్చే అవకాశం ఉండదు. కానీ జగన్ మాత్రం ఇచ్చిన ప్రతిహామీనీ గుర్తు పెట్టుకొని వాటిని ఆగమేఘాల మీద నెరవేర్చేందుకు ముందుకు వెళుతున్నారు.
ఈక్రమంలో ఎన్నో అపవాదులు, విమర్శలు వస్తున్నాయి. ఇవి పట్టించుకునే పరిస్థితుల్లో జగన్ లేరు. తండ్రి వైఎస్ ఆర్ కు ఇప్పటికీ ఇంటికో అభిమాని ఉన్నారు. అన్ని కుటుంబాలలోనూ ఆయన ద్వారా లబ్దిపొందిన వారు ఉన్నారు. అవన్నీ జగన్ కు తెలుసు. అదే ఒరవడిని కొనసాగించాలన్నదే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలంటే ప్రజావసరాలను ముందుగానే గుర్తించి నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా జగన్ ముందుకు వెళుతున్నారు.