ఆరేళ్ల కనిష్టస్థాయికి దేశ జీడీపీ పతనం
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అంతర్జాతీయ మందగమనం కలిసి దేశ జీడీపీని ఆరేళ్ల కనిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి జీడీపీ చేరింది. గత ఏడాది ఇదే మూడు నెలల కాలానికి వృద్ధి రేటు 7 శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా నమోదైంది. ఇప్పుడు జీడీపీ మరింత తగ్గింది. 2012-13 జనవరి- […]
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అంతర్జాతీయ మందగమనం కలిసి దేశ జీడీపీని ఆరేళ్ల కనిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి జీడీపీ చేరింది.
గత ఏడాది ఇదే మూడు నెలల కాలానికి వృద్ధి రేటు 7 శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా నమోదైంది. ఇప్పుడు జీడీపీ మరింత తగ్గింది.
2012-13 జనవరి- మార్చి త్రైమాసికంలో నమోదైన 4.3 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యంత తక్కువ అంకె. తయారీ రంగంలో వృద్ధి క్షీణించింది. వ్యవసాయ వృద్దిరేటు 2.1గా ఉంది. నిర్మాణ రంగ వృద్ధి 8.5 శాతం నుంచి 3.3శాతానికి తగ్గింది.
ఈ పరిణామంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వృద్ధి తొలి త్రైమాసికంలో 5 శాతం గా ఉండగా…. ఇప్పుడు 4.5 శాతానికి పడిపోవడం ఆందోళనకరమన్నారు. విధానాల్లో స్వల్ప మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. సమాజం ప్రస్తుతం భయంలో ఉందని… ఆ పరిస్థితిని మార్చి విశ్వాసం వైపు ఆర్థిక వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారనడానికి జీడీపీ లెక్కలే నిదర్శనమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మోడీ ప్రభుత్వంలో జీడీపీ అన్నది గాడ్సే డివిజన్ పాలిటిక్స్‌గా మార్చేశారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అతిపెద్ద ఉద్యోగ నాశనిగా మారిందని వ్యాఖ్యానించారు.