అశ్వత్ధామరెడ్డికి షాక్... డ్రైవర్‌గా డ్యూటీ
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆర్టీసీ యూనియన్ నాయకులకు డ్యూటీల నుంచి మినహాయింపు ఉంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో యూనియన్ నాయకులకు మినహాయింపులను ఎత్తివేశారు. ఆర్టీసీ కార్మిక నేతలు కూడా సాధారణ కార్మికుల తరహాలోనే డ్యూటీ చేయాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసింది. డ్యూటీ రిలీఫ్ హక్కులను రద్దు చేసింది. కార్మిక నేతలు కూడా ఇతర కార్మికుల తరహాలోనే డ్యూటీకి హాజరుకావాలని, లేనిపక్షంలో సెలవు పెట్టివెళ్లిపోవాల్సి ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. […]
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆర్టీసీ యూనియన్ నాయకులకు డ్యూటీల నుంచి మినహాయింపు ఉంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో యూనియన్ నాయకులకు మినహాయింపులను ఎత్తివేశారు. ఆర్టీసీ కార్మిక నేతలు కూడా సాధారణ కార్మికుల తరహాలోనే డ్యూటీ చేయాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసింది. డ్యూటీ రిలీఫ్ హక్కులను రద్దు చేసింది.
కార్మిక నేతలు కూడా ఇతర కార్మికుల తరహాలోనే డ్యూటీకి హాజరుకావాలని, లేనిపక్షంలో సెలవు పెట్టివెళ్లిపోవాల్సి ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 30 మంది కార్మిక నేతలకు డ్యూటీ మినహాయింపు ఉంది. దాంతో వారు విధులు నిర్వహించకుండా యూనియన్ పనుల మీద తిరుగుతున్నారు.
అధికారిక కార్మిక సంఘమైన టీఎంయూకు కేటాయించిన కార్యాలయాలకు ఆర్టీసీ యాజమాన్యం తాళాలు వేసింది. కార్మిక సంఘాల కోసం కార్మికుల నుంచి సభ్యత్వ రుసుము వసూలును కూడా యాజమాన్యం నిలిపివేసింది.
తమకు డ్యూటీ మినహాయింపు ఎత్తివేయడంపై అశ్వత్ధామరెడ్డి స్పందించారు. ఇదో చిల్లర చర్య అని వ్యాఖ్యానించారు. తాను డ్రైవర్‌ను అని బస్సు నడిపేందుకు సిద్దమని.. అవసరమైతే సెలవు పెట్టేందుకు కూడా రెడీగా ఉన్నానని చెప్పారు. ఆర్టీసీలో యూనియన్లు ఉండాలా వద్దా అన్న దానిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు.