ఉత్తరప్రదేశ్‌లో 85 మంది విద్యార్థులకు లీటర్ పాలు మాత్రమే...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆవుల పట్ల చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. ఆవులకు చలికోట్లు కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులకు మాత్రం సరైన భోజన సదుపాయాలు కల్పించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే యూపీలో విద్యార్థులకు చపాతిలో కూరకు బదులు ఉప్పు అందిస్తున్నారన్న అంశం దుమారం రేపింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో నీళ్ల పాలు విద్యార్థులకు అందిస్తున్న అంశం జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. 85 మంది విద్యార్థులకు కేవలం […]
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆవుల పట్ల చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. ఆవులకు చలికోట్లు కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులకు మాత్రం సరైన భోజన సదుపాయాలు కల్పించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితమే యూపీలో విద్యార్థులకు చపాతిలో కూరకు బదులు ఉప్పు అందిస్తున్నారన్న అంశం దుమారం రేపింది.
తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో నీళ్ల పాలు విద్యార్థులకు అందిస్తున్న అంశం జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. 85 మంది విద్యార్థులకు కేవలం లీటర్ పాలు మాత్రమే వాడారు. లీటర్ పాలలోకి భారీగా నీరు చేర్చి వాటిని 85 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. రంగు మాత్రమే తెలుపు… మొత్తం నీరే అన్నట్టుగా ఉన్న పాలను అందించారు.
ఈ ఉదంతం దుమారం రేపడంతో ప్రభుత్వం బాధ్యులను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటన సోనెభద్రా జిల్లాలో జరిగింది. మధ్నాహ్న భోజనం సందర్భంగా ఇలా లీటర్ పాలకు నీరు కలిపి 85 మంది విద్యార్థులకు అందించారు.