Telugu Global
NEWS

బాబు వల్ల నష్టపోయా.... అందుకే చెప్పు విసిరా " విచారణలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారి

రాజధాని పర్యటనకు వచ్చిన చంద్రబాబుపై చెప్పులతో దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. చంద్రబాబుపై చెప్పు విసిరింది ఒక రైతు, మరో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. చెప్పులు వేయడానికి కారణం కూడా విచారణలో ఇప్పటికే రైతు, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెల్లడించారని డిజీపీ వివరించారు. చంద్రబాబును నమ్మి అమరావతి ప్రాంతంలో వెంచర్ వేసి నష్టపోయానని… అందుకే చంద్రబాబుపై చెప్పు వేశానని రియల్ఎస్టేట్ వ్యాపారి […]

బాబు వల్ల నష్టపోయా.... అందుకే చెప్పు విసిరా  విచారణలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారి
X

రాజధాని పర్యటనకు వచ్చిన చంద్రబాబుపై చెప్పులతో దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. చంద్రబాబుపై చెప్పు విసిరింది ఒక రైతు, మరో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

చెప్పులు వేయడానికి కారణం కూడా విచారణలో ఇప్పటికే రైతు, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెల్లడించారని డిజీపీ వివరించారు. చంద్రబాబును నమ్మి అమరావతి ప్రాంతంలో వెంచర్ వేసి నష్టపోయానని… అందుకే చంద్రబాబుపై చెప్పు వేశానని రియల్ఎస్టేట్ వ్యాపారి విచారణలో చెప్పినట్టు డీజీపీ వెల్లడించారు.

రాజధాని పేరుతో ఈ ప్రాంతంలోని రైతులను చంద్రబాబు మోసం చేశారని అందుకే చెప్పుతో దాడి చేసినట్టు విచారణలో రైతు వివరించారని డీజీపీ చెప్పారు. పోలీసులపై చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్పందించిన గౌతమ్ సవాంగ్… తమకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.

శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని… ఎవరైనా సరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా ఉండాలని ప్రభుత్వం తమను ఆదేశించిందని డీజీపీ వివరించారు. రాజకీయ నాయకులు చేసే విమర్శలకు తాను స్పందించబోనన్నారు.

First Published:  28 Nov 2019 9:22 PM GMT
Next Story