బీజేపీలో చేరిన బైరెడ్డి.... బిగ్ బాస్ కౌశల్
ఏపీ బీజేపీలో మళ్లీ చేరికలు ప్రారంభమయ్యాయి. కండువా మార్పిడీల కార్యక్రమం మళ్లీ ఊపందుకుంది. టీడీపీ కీలక నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగిన వేళ సీమ నేత ఒకరు, విశాఖ నుంచి మరొకరు పార్టీలో చేరారు. కండువాలు కప్పుకున్నారు. రాయలసీమలో ఇప్పటికే పలు పార్టీలు మారిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన కూతురు శబరి… కమలం కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల తరువాత రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పెట్టారు. పాదయాత్రలు చేశారు. చివరకు మొన్నటి ఎన్నికల ముందు […]
ఏపీ బీజేపీలో మళ్లీ చేరికలు ప్రారంభమయ్యాయి. కండువా మార్పిడీల కార్యక్రమం మళ్లీ ఊపందుకుంది. టీడీపీ కీలక నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగిన వేళ సీమ నేత ఒకరు, విశాఖ నుంచి మరొకరు పార్టీలో చేరారు. కండువాలు కప్పుకున్నారు.
రాయలసీమలో ఇప్పటికే పలు పార్టీలు మారిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన కూతురు శబరి… కమలం కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల తరువాత రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పెట్టారు. పాదయాత్రలు చేశారు. చివరకు మొన్నటి ఎన్నికల ముందు పార్టీ ఎత్తేశారు. కాంగ్రెస్ టు టీడీపీ వరకు జంప్‌లు చేశారు. చివరకు ఇప్పుడు బీజేపీలో చేరారు.
నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డికి అంతో ఇంతో పట్టు ఉండేది. పార్టీల మార్పుతో ఇప్పుడు పట్టు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు బైరెడ్డి సిద్దార్థరెడ్డి రూపంలో వారసుడు సవాల్ విసురుతున్నారు.
ఇంకోవైపు బైరెడ్డితో పాటు బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్, ఆయన భార్య కూడా కమలం కండువా కప్పుకున్నారు. ఆయన ఏం ఆశించి బీజేపీలో చేరారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వీరితోపాటు అనగాని సులోచన యాదవ్ కూడా కమలం కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కూతురు శబరి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ల ఆశీర్వాదం తీసుకున్నారు.