Telugu Global
NEWS

ఇంగ్లీష్‌ వద్దంటున్న వారంతా బీసీ వ్యతిరేకులే....

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న వారంతా ఎస్సీ ఎస్టీ బీసీ వ్యతిరేకులేనని అభివర్ణించారు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి. ఇప్పటి వరకు డబ్బున్న వారు మాత్రమే లక్షలు పోసి వారి పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలిగారని… ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకూ ఇక ఇంగ్లీష్ అందుతుందన్నారు. తెలుగు మీడియంలో చదివిన పిల్లలు ఇంటర్వ్యూల్లో, పెద్దపెద్ద కంపెనీ ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని వివరించారు. ఇంగ్లీష్ […]

ఇంగ్లీష్‌ వద్దంటున్న వారంతా బీసీ వ్యతిరేకులే....
X

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న వారంతా ఎస్సీ ఎస్టీ బీసీ వ్యతిరేకులేనని అభివర్ణించారు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి. ఇప్పటి వరకు డబ్బున్న వారు మాత్రమే లక్షలు పోసి వారి పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలిగారని… ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకూ ఇక ఇంగ్లీష్ అందుతుందన్నారు. తెలుగు మీడియంలో చదివిన పిల్లలు ఇంటర్వ్యూల్లో, పెద్దపెద్ద కంపెనీ ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని వివరించారు.

ఇంగ్లీష్ విద్య వల్ల తెలుగు పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ చిన్న ఉద్యోగం సాధించాలన్నా ఇంగ్లీష్ తప్పనిసరిగా కావాల్సిందేనన్నారు. తెలుగు భాషకు ఏదో ముప్పు వస్తుందంటున్న వారు సొంత పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారో సమాధానం చెప్పాలని నారాయణమూర్తి ప్రశ్నించారు.

”తెలుగు భాషకు ఏదో ముప్పు వచ్చిందని బాధపడుతున్న వారి పిల్లలు, మనవళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా..? ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారా..? మన ఇంటిలో మాట్లాడుకునేది మాతృ భాష తెలుగు…. కాని మన ఇంటిలో వారిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? నాన్నా, అమ్మ, అన్నయ్య, బాబాయ్, అత్త అనే పదాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయ్‌. మమ్మి, డాడీ, బ్రో, ఆంటీ, అంకుల్‌ ఈ పిలుపులతో పిలిచినప్పుడు తెలుగు భాష గుర్తుకు రాలేదా..? ఇంటిలో పిల్లలకు పాత తరం వారు వారి తల్లిదండ్రులు, తాత, ముత్తాతల పేర్లు పెట్టేవారు. కాని నేడు మున్ని, ట్వింకిల్‌ అనే మోడ్రన్‌ పేర్లతో పిలుస్తున్నారు. అప్పుడు తెలుగు గుర్తుకు రాలేదా?” అని ప్రశ్నించారు.

తెలుగును కాపాడేది ఈ బడుగు, బలహీన వర్గాల పిల్లలేనా? ప్రశ్నించే వారి పిల్లలకు తెలుగును కాపాడే అవసరం లేదా?. జగన్‌ గారు ఇంగ్లిష్‌ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్‌ ఎలా తప్పనిసరి చేశారో.. కార్పొరేట్‌ స్కూళ్లలో కూడా తెలుగు సబ్జెక్ట్‌ తప్పని సరి చేయాలి అని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన జగన్‌మోహన్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని… సీఎంకు ఈ విషయంలో కృతజ్ఞతలు చెబుతున్నట్టు నారాయణమూర్తి వెల్లడించారు.

First Published:  28 Nov 2019 10:30 AM IST
Next Story