రాయుడిపై హైదరాబాద్ క్రికెట్ సంఘం సీరియస్
రాయుడికి అండగా మాజీ క్రికెటర్లు ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం భ్రష్టుపట్టి పోయిందని, సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ మంత్రి కేటీఆర్ కు కెప్టెన్ అంబటి రాయుడు ట్విట్ చేయటాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం తీవ్రంగా పరిగణిస్తున్న కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు. రాయుడు నిబంధనలు అతిక్రమించాడని, డిసెంబర్ 6 తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని చెప్పారు. మరోవైపు…రాయుడు కు తాము అండగా ఉన్నామని, రాయుడి వాదనలో ఎంతో నిజం, ఆవేదన ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు, మాజీ […]
- రాయుడికి అండగా మాజీ క్రికెటర్లు
ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం భ్రష్టుపట్టి పోయిందని, సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ మంత్రి కేటీఆర్ కు కెప్టెన్ అంబటి రాయుడు ట్విట్ చేయటాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం తీవ్రంగా పరిగణిస్తున్న కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు.
రాయుడు నిబంధనలు అతిక్రమించాడని, డిసెంబర్ 6 తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని చెప్పారు.
మరోవైపు…రాయుడు కు తాము అండగా ఉన్నామని, రాయుడి వాదనలో ఎంతో నిజం, ఆవేదన ఉన్నాయని పలువురు మాజీ క్రికెటర్లు, మాజీ క్రికెట్ సంఘం సభ్యులు అంటున్నారు.
రాయుడి ఆవేదనలో నిజాయితీ ఉంది…
హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడి వాదనలో ఎంతో నిజం ఉందని, హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతి వేళ్లూను కొనిపోయిందని, ఆటగాళ్ల ఎంపికలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయన్నది జగమెరిగిన సత్యమని, సెలెక్టర్ల అవినీతి కారణంగానే హైదరాబాద్ క్రికెట్ భ్రష్టు పట్టిపోయిందని.. మాజీ ప్లేయర్ కన్వల్ జీత్ సింగ్ అన్నారు.
హైదరాబాద్ క్రికెట్ లోటుపాట్ల గురించి కెప్టెన్ గా తన మనసులో మాట బయటపెట్టే హక్కు రాయుడికి ఉందని హైదరాబాద్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
రాయుడితో తనకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా…ఆటగాడిగా ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయని అన్నారు.
మాజీ కార్యదర్శి శేష్ నారాయణ సైతం రాయుడిని వెనకేసుకొచ్చారు. రాయుడు చెప్పిందాంట్లో నిజానిజాలేమిటో అజర్ గ్రహించాలని, రాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటే..అంతకంటే మించిన పొరపాటు మరొకటి ఉండదని హెచ్చరించారు.