చంద్రబాబు ఎదుటే కొట్టుకున్న కడప తమ్ముళ్లు
కడప టీడీపీ సమీక్షా సమావేశంలో చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.ఇప్పటికే కొందరు నేతలు టీడీపీని వీడిపోయారు. మరికొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి తొలి రోజు సమావేశానికి డుమ్మా కొట్టారు. కానీ పార్టీ పెద్ద నుంచి ఫోన్లు రావడంతో రెండో రోజు హాజరయ్యారు. మరోవైపు మంగళవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కడప నగర టీడీపీ రివ్యూ సందర్భంగా 15వ […]
కడప టీడీపీ సమీక్షా సమావేశంలో చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.ఇప్పటికే కొందరు నేతలు టీడీపీని వీడిపోయారు. మరికొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి తొలి రోజు సమావేశానికి డుమ్మా కొట్టారు. కానీ పార్టీ పెద్ద నుంచి ఫోన్లు రావడంతో రెండో రోజు హాజరయ్యారు.
మరోవైపు మంగళవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కడప నగర టీడీపీ రివ్యూ సందర్భంగా 15వ డివిజన్ కొండా సుబ్బయ్య చంద్రబాబు సమక్షంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తమను చిన్న చూపు చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు సుబ్బయ్యపై దాడి చేశారు. తన సమక్షంలోనే దాడి జరగడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు.
ఇటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన శివనాథరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ప్రొద్దుటూరు నేత వరదరాజులు రెడ్డి, బద్వేలు విజయమ్మ, సుగవసి ప్రసాద్ అలాగే రాయచోటి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, ఆయన వర్గీయులు సైతం టీడీపీ సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు.
ఇప్పటికే కడపలో సీనియర్ నేతలు సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. మరోపక్క అధికారికంగా పార్టీని వీడని మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, కె.విజయమ్మ తదితరులు మౌనంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరు నేడోరేపో పార్టీని వీడతారన్న ప్రచారంసాగుతోంది.