30 ఏళ్ల వయసులో డేవిస్ కప్ చాన్స్
పాక్ తో డేవిస్ కప్ సమరానికి జీవన్ జీవితం చాలా విచిత్రమైనది. కొందరికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కొంటూ వస్తే…మరికొందరు మాత్రం తమ వంతు కోసం ఎక్కడలేని ఓర్పుతో ఎదురుచూడక తప్పదు. అలాంటి కోవకు చెందిన ఆటగాడే తమిళనాడుకు చెందిన జీవన్ నెడుంజెళియన్. ప్రస్తుత భారత టెన్నిస్ లో ప్రధాన డబుల్స్ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న ముప్పైఏళ్ల జీవన్ కు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో డబుల్స్ టోర్నీలు నెగ్గిన రికార్డు ఉన్నా.. భారత డేవిస్ కప్ జట్టులో మాత్రంచోటు దక్కలేదు. డేవిస్ […]
- పాక్ తో డేవిస్ కప్ సమరానికి జీవన్
జీవితం చాలా విచిత్రమైనది. కొందరికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కొంటూ వస్తే…మరికొందరు మాత్రం తమ వంతు కోసం ఎక్కడలేని ఓర్పుతో ఎదురుచూడక తప్పదు. అలాంటి కోవకు చెందిన ఆటగాడే తమిళనాడుకు చెందిన జీవన్ నెడుంజెళియన్.
ప్రస్తుత భారత టెన్నిస్ లో ప్రధాన డబుల్స్ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న ముప్పైఏళ్ల జీవన్ కు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో డబుల్స్ టోర్నీలు నెగ్గిన రికార్డు ఉన్నా.. భారత డేవిస్ కప్ జట్టులో మాత్రంచోటు దక్కలేదు.
డేవిస్ కప్ ఆడకుండానే రిటైరైపోతానేమో అనుకొన్న జీవన్ ను అదృష్టం అనుకోకుండా వచ్చి వరించింది. పాకిస్థాన్ తో కజకిస్థాన్ వేదికగా నవంబర్ 29, 30 తేదీలలో పాల్గొనే డేవిస్ కప్ పోటీలో భారత్ తరపున పాల్గొనే అవకాశం వచ్చింది.
సీనియర్ ఆటగాళ్లు రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడంతో రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్న జీవన్ ప్రధానజట్టులో స్థానం సంపాదించగలిగాడు.
46 ఏళ్ల లియాండర్ పేస్ తో కలసి జంటగా డబుల్స్ లో జీవన్ పోటీకి దిగనున్నాడు. మూడుపదుల వయసులో అవకాశం వచ్చినా తాను ఏమాత్రం బాధపడటం లేదని.. దేశం తరపున ఎట్టకేలకు ఆడే అవకాశం రావడమే గొప్ప విషయమని, తన టెన్నిస్ కెరియర్ లో ఇదో గొప్ప అనుభవంగా, అవకాశంగా మిగిలిపోతుందని ధీమాగా చెబుతున్నాడు.
పాకిస్థాన్ లాంటి బలహీనమైనజట్టుపైన తమ విజయం ఖాయమే అయినా…విజయం విజయమేనని సమర్థించుకొన్నాడు.