Telugu Global
NEWS

హైకోర్టు నోటీసులు.... జేసీ ఫ్యామిలీకి మరో షాక్....

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. మైనింగ్ లీజు విషయంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తా రెడ్డిలు చిక్కుల్లో పడ్డారు. వీరితోపాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు […]

హైకోర్టు నోటీసులు.... జేసీ ఫ్యామిలీకి మరో షాక్....
X

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. మైనింగ్ లీజు విషయంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తా రెడ్డిలు చిక్కుల్లో పడ్డారు. వీరితోపాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

తాజాగా హైకోర్టు త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు విషయంలో జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కు వాయిదా వేసింది.

సున్నపురాయి మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని.. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ 2011లో తాడిపత్రికి చెందిన వి.మురళీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు…. ఈ ఏడాది సెప్టెంబర్ లో జేసీ దివాకర్ రెడ్డి సహా త్రిశూల్ సంస్థ నిర్వహణ భాగస్వాములకు నోటీసులు ఇచ్చింది.

ఇప్పటికే జేసీ ఫ్యామిలీకి ఉన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు సర్వీసుల పై ఏపీ సర్కారు కొరఢా ఝలిపించింది. దివాకర్ ట్రావెల్స్ మూతపడే స్థాయిలో ఉందన్న ప్రచారమూ సాగుతోంది. ఇప్పుడు మరో కేసుతో జేసీ ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. ఇప్పటికే జేసీ ఆర్థిక మూలాలపై ఒక్కొక్క దెబ్బ పడుతోంది. హైకోర్టు నోటీసులతో ఇప్పుడు మరో దెబ్బ తగిలింది.

First Published:  27 Nov 2019 9:24 AM IST
Next Story