ఖైదీ ఫైనల్ వసూళ్లు... రెట్టింపు లాభాలు
ఎట్టకేలకు తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకున్నాడు కార్తి. ఇంకా చెప్పాలంటే ఖాకి సినిమా తర్వాత కార్తికి హిట్ అందించిన సినిమా ఖైదీ మాత్రమే. కేవలం మూడున్నర కోట్లు పెట్టి కొన్న ఖైదీ తెలుగు వెర్షన్ కు అక్షరాలా 7 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే రూపాయికి రూపాయి లాభం అన్నమాట. ఈమధ్య కాలంలో మౌత్ టాక్ తో బ్రహ్మాండంగా ఆడిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖైదీ మాత్రమే. కార్తికి వరుసగా ఫ్లాపులు రావడంతో ఈ సినిమాను […]

ఎట్టకేలకు తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకున్నాడు కార్తి. ఇంకా చెప్పాలంటే ఖాకి సినిమా తర్వాత కార్తికి హిట్ అందించిన సినిమా ఖైదీ మాత్రమే. కేవలం మూడున్నర కోట్లు పెట్టి కొన్న ఖైదీ తెలుగు వెర్షన్ కు అక్షరాలా 7 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే రూపాయికి రూపాయి లాభం అన్నమాట.
ఈమధ్య కాలంలో మౌత్ టాక్ తో బ్రహ్మాండంగా ఆడిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖైదీ మాత్రమే. కార్తికి వరుసగా ఫ్లాపులు రావడంతో ఈ సినిమాను మొదటి రోజు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ అద్భుతంగా ఉండడంతో, రెండో రోజు నుంచి జనాలు రావడం స్టార్ట్ చేశారు. అలా రోజురోజుకు ఆక్యుపెన్సీతో పాటు వసూళ్లను పెంచుకుంటూ పోయింది ఖైదీ. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 2.20 కోట్లు
సీడెడ్ – రూ. 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర -రూ. 1.25 కోట్లు
ఈస్ట్ – రూ. 0.50 కోట్లు
వెస్ట్ – రూ. 0.40 కోట్లు
గుంటూరు – రూ. 0.70 కోట్లు
నెల్లూరు – రూ. 0.30 కోట్లు
కృష్ణా – రూ. 0.80 కోట్లు