Telugu Global
NEWS

బ‌యోడైవ‌ర్సిటీ బాధితురాలికి జ‌గ‌న్ చేయూత....

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి స్పందించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ బాధితురాలికి ఆపరేషన్ కోసం సాయానికి ముందుకొచ్చారు. ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు చూసిన వెంట‌నే సీఎం స‌హాయ నిధి కింద నిధులు విడుద‌ల చేశారు. హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి కారు ప‌డిన ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ అక్కడికక్కడే చ‌నిపోయింది. అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఆమె ఆపరేషన్ కోసం 5లక్షలు […]

బ‌యోడైవ‌ర్సిటీ బాధితురాలికి జ‌గ‌న్ చేయూత....
X

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి స్పందించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ బాధితురాలికి ఆపరేషన్ కోసం సాయానికి ముందుకొచ్చారు. ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు చూసిన వెంట‌నే సీఎం స‌హాయ నిధి కింద నిధులు విడుద‌ల చేశారు.

హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి కారు ప‌డిన ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ అక్కడికక్కడే చ‌నిపోయింది. అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఆమె ఆపరేషన్ కోసం 5లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. సాధారణ పెయింటర్ గా జీవనం సాగించే ఆ యువతి తండ్రి అబ్దుల్ అజీమ్ అంత డబ్బు చెల్లించే స్థోమత లేక సహాయం కోసం ఆసుపత్రి బయట దీనంగా ఎదురుచూస్తున్నాడు.

ప‌త్రిక‌ల్లో ఈ వార్తను చూసిన వైసీపీ నేత‌లు కొంద‌రు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి…. ఎంత ఖర్చయినా పర్వాలేదు తక్షణమే ఆపరేషన్ కోసం కావలసిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచెయ్యాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

తమ కూతురు ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం చెయ్యడానికి ముందుకొచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. సాయం కోసం ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ఆపద్భాంధవుడిలా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

First Published:  26 Nov 2019 3:46 AM IST
Next Story