Telugu Global
NEWS

చంద్రబాబూ... నీ కంట రక్త కన్నీరు ఖాయం

పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు గేట్లను ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్ రెడ్డి ఎత్తి నీటిని కిందికి విడుదల చేసే దృశ్యాన్ని అందరూ చూసి తీరుతారన్నారు. ఆ దృశ్యాన్ని చూసి చంద్రబాబు కంట రక్త కన్నీరు ఖాయమన్నారు. జూన్‌ నాటికల్లా స్పిల్‌వే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. చంద్రబాబు పాలనలో వర్షాలు రాక జనం అల్లాడిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు కన్నీరు పెట్టుకున్నారన్నారు. దీన్ని బట్టే ఎవరి […]

చంద్రబాబూ... నీ కంట రక్త కన్నీరు ఖాయం
X

పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు గేట్లను ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్ రెడ్డి ఎత్తి నీటిని కిందికి విడుదల చేసే దృశ్యాన్ని అందరూ చూసి తీరుతారన్నారు. ఆ దృశ్యాన్ని చూసి చంద్రబాబు కంట రక్త కన్నీరు ఖాయమన్నారు. జూన్‌ నాటికల్లా స్పిల్‌వే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.

చంద్రబాబు పాలనలో వర్షాలు రాక జనం అల్లాడిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు కన్నీరు పెట్టుకున్నారన్నారు. దీన్ని బట్టే ఎవరి పాదం ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు ఒక నెలరోజులు సింగపూర్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని వస్తే బాగుంటుందన్నారు.

పోలవరం నిర్వాసితుల కోసం మొదటి దశలో 17వేల ఇళ్ళను నిర్మించి వారిని అక్కడికి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పదేపదే పోలవరం ప్రాజెక్టును 75 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబుతున్నారని కానీ అది నిజం కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటే కేవలం డ్యాం కట్టడమే కాదని… పునరావాసం కూడా కల్పించాల్సి ఉంటుందన్నారు. ఇది 55వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అని వివరించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు 16వేల 700 కోట్లు మాత్రమేనన్నారు. అందులో 5వేల కోట్లు వైఎస్ఆర్‌ హయాంలోనే ఖర్చు చేశారన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనది, ఖరీదైనది పునరావాసమేనన్నారు. ప్రస్తుతం ఖర్చు పెట్టిన లెక్కల ప్రకారం చూస్తే ప్రాజెక్టు ఇప్పటి వరకు 30 శాతం లోపే పూర్తయిందన్నారు. కీలకమైన పునరావాసం గురించి మాట్లాడకుండా చంద్రబాబు 75 శాతం ప్రాజెక్టును నిర్మించామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

డ్యాం నిర్మాణం, పునరావాసం కలిపి చూస్తే ప్రాజెక్టు నిర్మాణం 30 శాతం లోపే ఉందన్నారు. ముంపు గ్రామాల వారి కోసం లక్షా ఐదు వేల ఇళ్లు నిర్మించి, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని…. అదంతా ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. డ్యాం కట్టేసి చుట్టూ పక్కల గ్రామాల వారికి నష్టపరిహారం ఇవ్వకుండా ముంచేయాలని చంద్రబాబు భావించారా అని మంత్రి ప్రశ్నించారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఇక్కడ ముంపుకు గురవుతున్న గిరిజనులు, ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పునరావాసం పర్యవేక్షించేందుకు ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించారని అనిల్ చెప్పారు. పునరావాసం కల్పించకుండానే కాపర్ డ్యాం నిర్మించడం ద్వారా పలుగ్రామాలను వరదలో ముంచేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల కోట్లు రావాల్సి ఉందని…. దాన్ని కూడా తెచ్చుకోలేకపోతున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారని … ఆ మొత్తం ఇప్పటి నుంచి కాదని… 2017 నుంచే పెండింగ్‌లో ఉందన్నారు. చంద్రబాబు ఏడాదిన్నర పాటు సీఎంగా ఉండి ఆ నిధులు తీసుకురాకుండా ఏం ఏడిశారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 19వందల కోట్లు తీసుకురాగలిగామన్నారు.

First Published:  26 Nov 2019 12:24 PM IST
Next Story