మహా రాజకీయంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు... తీర్పు రిజర్వ్
మహారాష్ట్ర రాజకీయంపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణం బలపరీక్ష అవసరమని వ్యాఖ్యానించింది. బలపరీక్షకు రెండుమూడు రోజులు సమయం కావాలని కోరింది బీజేపీ. కానీ బీజేపీ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. వెంటనే బలపరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది. తమకు కావాల్సినంత బలం ఉందని బీజేపీ వాదించగా.. రాజ్‌భవన్ వేదికగా ఎంత బలం ఉంది అన్నది నిర్దారించలేమని… శాసనసభ వేదికగా బలపరీక్ష జరగాల్సిందేనని […]
మహారాష్ట్ర రాజకీయంపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణం బలపరీక్ష అవసరమని వ్యాఖ్యానించింది. బలపరీక్షకు రెండుమూడు రోజులు సమయం కావాలని కోరింది బీజేపీ. కానీ బీజేపీ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. వెంటనే బలపరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే తుది తీర్పును రేపటికి వాయిదా వేసింది.
తమకు కావాల్సినంత బలం ఉందని బీజేపీ వాదించగా.. రాజ్‌భవన్ వేదికగా ఎంత బలం ఉంది అన్నది నిర్దారించలేమని… శాసనసభ వేదికగా బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలస్యం అయ్యే కొద్ది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో… వీలైనంత త్వరగానే బలపరీక్ష జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మీకు బలం ఉంటే తక్షణం దాన్ని నిరూపించుకునేందుకు ఇబ్బంది ఏమిటి? అని బీజేపీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
అసలైన ఎన్‌సీపీ తమదేనని అజిత్ పవార్ తరపున న్యాయవాది వాదించారు. 54 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు లేఖలు కూడా ఇచ్చారని వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. తీర్పు రేపు ఉదయమే వెలువడే అవకాశం ఉంది.