Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో భారత్ రికార్డుల మోత

కెప్టెన్ గా కొహ్లీ ఖాతాలో అరుదైన రికార్డులు బంగ్లాదేశ్ పై సిరీస్ విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు సాంప్రదాయటెస్ట్ క్రికెట్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తన ప్రపంచ రికార్డులు తానే అధిగమించుకొంటూ దూసుకుపోతోంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో అలవోకగా నెగ్గడం ద్వారా 360 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఇన్నింగ్స్ విజయాల రికార్డు… కోల్ కతా ఈడెన్ […]

టెస్ట్ క్రికెట్లో భారత్ రికార్డుల మోత
X
  • కెప్టెన్ గా కొహ్లీ ఖాతాలో అరుదైన రికార్డులు
  • బంగ్లాదేశ్ పై సిరీస్ విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు

సాంప్రదాయటెస్ట్ క్రికెట్లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. తన ప్రపంచ రికార్డులు తానే అధిగమించుకొంటూ దూసుకుపోతోంది.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో అలవోకగా నెగ్గడం ద్వారా 360 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

ఇన్నింగ్స్ విజయాల రికార్డు…

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను భారత్ కేవలం రెండున్నర రోజుల ఆటలోనే ఇన్నింగ్స్ 146 పరుగుల తేడాతో నెగ్గి…. ఇన్నింగ్స్ విజయాలలో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

సౌతాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించిన భారత్…ప్రస్తుత బంగ్లా సిరీస్ లోని రెండుకు రెండుటెస్టులూ ఇన్నింగ్స్ తేడాతో నెగ్గి తనకు తానే సాటిగా నిలిచింది.

టెస్ట్ క్రికెట్లో తన జట్టుకు వరుసగా నాలుగు ఇన్నింగ్స్ విజయాలు అందించిన తొలి కెప్టెన్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు.
వరుసగా 7 టెస్ట్ విజయాలు… ఇప్పటి వరకూ మహేంద్రసింగ్ ధోనీ పేరుతో ఉన్న ఆరు వరుస విజయాల టెస్ట్ రికార్డును విరాట్ కొహ్లీ …7వ విజయంతో అధిగమించాడు.

టెస్ట్ లీగ్ లో భాగంగా విండీస్ తో జరిగిన రెండుమ్యాచ్ ల సిరీస్ , సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్, బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ తో సహా వరుసగా ఏడు టెస్టులు నెగ్గిన ఘనత కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి మాత్రమే దక్కుతుంది.

12 వరుస సిరీస్ విజయాల ప్రపంచ రికార్డు..

బంగ్లాదేశ్ పై సిరీస్ విజయంతో విరాట్ సేన సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తానే అధిగమించింది. సొంత గడ్డపై వరుసగా 12 టెస్ట్ సిరీస్ విజయాలు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డుల్లో చేరింది.

గతంలో ఆస్ట్ర్రేలియా మాత్రమే పది స్వదేశీ సిరీస్ లు నెగ్గడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించింది. ఆ రికార్డును…సౌతాఫ్రికాపై 3-0తో నెగ్గడం ద్వారా భారత్ తెరమరుగు చేసింది.

మొత్తం 11 జట్ల ఐసీసీ టెస్ట్ లీగ్ లోని మొదటి మూడు సిరీస్ లు అలవోకగా నెగ్గడం ద్వారా భారత్ 360 పాయింట్లతో టేబుల్ టాపర్ గా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

First Published:  25 Nov 2019 2:36 AM IST
Next Story