భారత పేసర్ల అరుదైన రికార్డు
డే-నైట్ టెస్టులో పేసర్లకే 20 వికెట్లు బంగ్లాదేశ్ తో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలి డే-నైట్ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ల త్రయం ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ విశ్వరూపమే ప్రదర్శించారు. బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్స్ లో 106, రెండో ఇన్నింగ్స్ లో 197 పరుగుల స్కోర్లకు ఆలౌట్ చేయడం ద్వారా మ్యాచ్ ను కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ విజయంతో ముగించగలిగారు. పేసర్లకే 20 వికెట్లు… భారత టెస్టు చరిత్రలోనే […]
- డే-నైట్ టెస్టులో పేసర్లకే 20 వికెట్లు
బంగ్లాదేశ్ తో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలి డే-నైట్ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ల త్రయం ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ విశ్వరూపమే ప్రదర్శించారు.
బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్స్ లో 106, రెండో ఇన్నింగ్స్ లో 197 పరుగుల స్కోర్లకు ఆలౌట్ చేయడం ద్వారా మ్యాచ్ ను కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ విజయంతో ముగించగలిగారు.
పేసర్లకే 20 వికెట్లు…
భారత టెస్టు చరిత్రలోనే సొంత గడ్డపై భారత ఫాస్ట్ బౌలర్ల త్రయం ఓ అరుదైన రికార్డు సాధించారు. కోల్ కతా టెస్టులో మొత్తం 20కి 20 వికెట్లూ పేసర్ల త్రయమే సాధించారు.
తొలి ఇన్నింగ్స్ లో ఇశాంత్ శర్మ 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఉమేశ్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టారు. ఓవరాల్ గా ఇశాంత్ శర్మ 9 వికెట్లు సాధించడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
స్పిన్నర్లకు ఒక వికెట్ దక్కకుండా ఫాస్ట్ బౌలర్లే రెండు ఇన్నింగ్స్ లోని మొత్తం వికెట్లు సాధించడం ఇదే మొదటిసారి. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ నేతృత్వంలో.. ఐదుగురు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ల దళంతో భారతజట్టు ప్రస్తుతం ప్రత్యర్థిజట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.