సీఎం రమేష్ కుమారుడి వివాహానికి 15 ప్రత్యేక విమానాలు
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన కుమారుడి వివాహాన్ని దుబాయ్‌లో అత్యంత వైభవంగా చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో వివాహం చేస్తున్నారు. ఇండియాలో ఇలా ఖరీదైన వివాహం చేస్తే అది రాజకీయ దుమారానికి దారి తీయడంతోపాటు… బీజేపీ పెద్దలకు కూడా కోపం తెప్పిస్తుందన్న ఉద్దేశంతో…. వేదికను దుబాయ్‌కి మార్చారు. ఈ వివాహానికి భారీగా టీడీపీ నేతలు తరలివెళ్లారు. చంద్రబాబు తర్జన భర్జన పడి… వివాహానికి వెళ్తే సీఎం రమేష్‌ను తాను బీజేపీలోకి పంపానన్న […]

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన కుమారుడి వివాహాన్ని దుబాయ్‌లో అత్యంత వైభవంగా చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో వివాహం చేస్తున్నారు.
ఇండియాలో ఇలా ఖరీదైన వివాహం చేస్తే అది రాజకీయ దుమారానికి దారి తీయడంతోపాటు… బీజేపీ పెద్దలకు కూడా కోపం తెప్పిస్తుందన్న ఉద్దేశంతో…. వేదికను దుబాయ్‌కి మార్చారు.
ఈ వివాహానికి భారీగా టీడీపీ నేతలు తరలివెళ్లారు. చంద్రబాబు తర్జన భర్జన పడి… వివాహానికి వెళ్తే సీఎం రమేష్‌ను తాను బీజేపీలోకి పంపానన్న అనుమానాలు మరింత బలపడుతాయన్న ఉద్దేశంతో వెళ్లకుండా విరమించుకున్నారు.
వివాహానికి హాజరయ్యే నేతలను తరలించేందుకు 15 ప్రత్యేక విమానాలను సీఎం రమేష్ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీలను కూడా సీఎం రమేష్ ఈ వివాహానికి ఆహ్వానించారు.