Telugu Global
NEWS

ప్రో-బాక్సింగ్ లో తిరుగులేని విజేందర్ సింగ్

గత నాలుగేళ్లుగా అజేయంగా విజేందర్ వరుసగా 12 విజయాలు సాధించిన భారత బాక్సర్ ప్రపంచ ప్రో-బాక్సింగ్ లో భారత ఏకైక ప్రో బాక్సర్ విజేందర్ సింగ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గత నాలుగేళ్లలో 12వ విజయంతో అజేయంగా నిలిచాడు. దుబాయ్ వేదికగా ముగిసిన 8 రౌండ్ల పోరులో ఘనాకు చెందిన 42 సంవత్సరాల చార్లెస్ అదామూను చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 34 ఏళ్ల విజేందర్ కు వెటరన్ అడాము ఏమాత్రం సమఉజ్జీగా నిలువలేకపోయాడు. మిడిల్ వెయిట్ […]

ప్రో-బాక్సింగ్ లో తిరుగులేని విజేందర్ సింగ్
X
  • గత నాలుగేళ్లుగా అజేయంగా విజేందర్
  • వరుసగా 12 విజయాలు సాధించిన భారత బాక్సర్

ప్రపంచ ప్రో-బాక్సింగ్ లో భారత ఏకైక ప్రో బాక్సర్ విజేందర్ సింగ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గత నాలుగేళ్లలో 12వ విజయంతో అజేయంగా నిలిచాడు. దుబాయ్ వేదికగా ముగిసిన 8 రౌండ్ల పోరులో ఘనాకు చెందిన 42 సంవత్సరాల చార్లెస్ అదామూను చిత్తు చేశాడు.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో 34 ఏళ్ల విజేందర్ కు వెటరన్ అడాము ఏమాత్రం సమఉజ్జీగా నిలువలేకపోయాడు.

మిడిల్ వెయిట్ విభాగంలో WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ విజేతగా ఉన్న విజేందర్…ఇప్పటి వరకూ తలపడిన 12 ఫైట్లలో అజేయంగా నిలిచాడు.

మొత్తం 12 ఫైట్లలో ఎనిమిది నాకౌట్ విజయాలు, మూడు టెక్నికల్ నాకౌట్ విజయాలు ఉన్నాయి. ప్రో-బాక్సర్ గా మారటానికి ముందు…దోహా ఆసియాక్రీడల్లో కాంస్య, బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు నెగ్గిన రికార్డు విజేందర్ కు ఉంది.

అంతేకాదు…అర్జున, రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు అందుకొన్న విజేందర్ 2009లో పద్మశ్రీ అవార్డును సైతం అందుకొన్నాడు.

ఇప్పటి వరకూ ఇంగ్లండ్, భారత్ , అమెరికా వేదికలుగా ముగిసిన పోటీలలోనే విజేతగా నిలిచిన విజేందర్…దుబాయ్ ప్రో బాక్సింగ్ సర్క్యూట్ లో సైతం విజయం సాధించడం విశేషం.

First Published:  24 Nov 2019 4:18 AM IST
Next Story