Telugu Global
National

బాబు ఒత్తిడికి సుజనా మర్దన

కొన్ని బంధాలు దాచినా దాగే ప్రసక్తే ఉండదు. సుజనా చౌదరి, చంద్రబాబు నాయుడి మధ్య బంధం కూడా అలాంటిదే. తాను బీజేపీ ఎంపీని అని సుజనాచౌదరి పైకి చెప్పుకుంటున్నా ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక బాబు అవసరాలు ధ్వనిస్తున్నాయి. చంద్రబాబు ఇబ్బంది పడే మాట వినిపడితే చాలు…. సుజనా చౌదరి మనసు చిముక్కు మంటోంది. ఇటీవల మీడియా సమావేశంలో కొందరు విలేకర్లు టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీతో టచ్‌లో ఉన్నారట కదా అని ప్రశ్నించగానే […]

బాబు ఒత్తిడికి సుజనా మర్దన
X

కొన్ని బంధాలు దాచినా దాగే ప్రసక్తే ఉండదు. సుజనా చౌదరి, చంద్రబాబు నాయుడి మధ్య బంధం కూడా అలాంటిదే. తాను బీజేపీ ఎంపీని అని సుజనాచౌదరి పైకి చెప్పుకుంటున్నా ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక బాబు అవసరాలు ధ్వనిస్తున్నాయి. చంద్రబాబు ఇబ్బంది పడే మాట వినిపడితే చాలు…. సుజనా చౌదరి మనసు చిముక్కు మంటోంది.

ఇటీవల మీడియా సమావేశంలో కొందరు విలేకర్లు టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీతో టచ్‌లో ఉన్నారట కదా అని ప్రశ్నించగానే సుజనాచౌదరి విచిత్రంగా స్పందించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు…. బీజేపీతో టచ్‌లో ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు పరిమితం కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తానే అన్నట్టు ప్రకటన చేశారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను తామే తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

సుజనా ఇలా ఎందుకన్నారంటే… చంద్రబాబు మీద ఒత్తిడి తగ్గించే ప్రయత్నమే. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. వల్లభనేని వంశీ ఓపెన్‌గా చంద్రబాబు పని అయిపోయింది… లోకేష్‌ నాయకత్వంలో టీడీపీ మునిగిపోతోంది అని తేల్చేశారు.

ఇలా చంద్రబాబు నాయకత్వం పని అయిపోయింది… అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలవడంతో టీడీపీ లో అలజడి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడం ద్వారా… అధికార పార్టీ అయిన వైసీపీ వారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి … టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం అన్నది చంద్రబాబు నాయకత్వం వైఫల్యం కిందకు రాదు అని నమ్మించేందుకు సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.

అధికార పార్టీ అయిన వైసీపీ నుంచే బీజేపీలోకి ఎంపీలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటే… ఇక ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోకూడదన్న ఆలోచనతోనే సుజనాచౌదరి ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది.

First Published:  23 Nov 2019 2:22 AM IST
Next Story