Telugu Global
National

10 నుంచి 11 మంది మాత్రమే అజిత్‌తో ఉన్నారు

10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అజిత్ పవార్‌తో ఉన్నారని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్ చెప్పారు. మిగిలిన వారంతా తమ వెంటే ఉన్నారన్నారు. ఇండిపెండెంట్లు కూడా తమ వైపు ఉన్నారన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో…. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో కలిసి శరద్‌పవార్‌ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అజిత్ పవార్‌ వెంట ఉన్న ఎమ్మెల్యేలు అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుందని శరద్‌ పవార్ హెచ్చరించారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ […]

10 నుంచి 11 మంది మాత్రమే అజిత్‌తో ఉన్నారు
X

10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అజిత్ పవార్‌తో ఉన్నారని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్ చెప్పారు. మిగిలిన వారంతా తమ వెంటే ఉన్నారన్నారు. ఇండిపెండెంట్లు కూడా తమ వైపు ఉన్నారన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో…. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో కలిసి శరద్‌పవార్‌ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

అజిత్ పవార్‌ వెంట ఉన్న ఎమ్మెల్యేలు అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుందని శరద్‌ పవార్ హెచ్చరించారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోలేదని జోస్యం చెప్పారు. శివసేన-ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందన్నారు. ప్రస్తుతం తమ కూటమికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శరద్ పవార్‌ వివరించారు.

బీజేపీకి అజిత్‌ పవార్‌ మద్దతు ఆయన వ్యక్తిగతం మాత్రమేనన్నారు. కొందరు ఎమ్మెల్యేలను తీసుకుని అజిత్ పవార్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారన్నారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్టు ఉదయం 6.30కు తెలిసిందన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన అజిత్‌పై పార్టీ పరంగా చర్యలు తప్పవని శరద్‌ పవార్ హెచ్చరించారు. అజిత్‌ పవార్‌ ఒక నీతిమాలిన చర్యకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఎన్‌సీపీ ఎప్పటికీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు.

బీజేపీ ఆడుతున్న వికృత క్రీడను దేశమంతా గమనిస్తోందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి, మరాఠ ప్రజలకు, రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ అసలు రంగు బహిర్గతమవుతుందన్నారు. బీజేపీ చర్య మహారాష్ట్రపై సర్జికల్ స్ట్రైక్‌గా ఠాక్రే అభివర్ణించారు. బీజేపీ ఇతర పార్టీలను చీల్చి రాజకీయాలు చేయాలనుకుంటోందని…. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. హర్యానా, బీహార్‌లోనూ బీజేపీ ఇదే రాజకీయం చేసిందన్నారు.

ఉదయం అజిత్ వెంట రాజ్‌భవన్‌కు వెళ్లిన ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు కొందరు మీడియా సమావేశంలో మాట్లాడారు. అజిత్‌ పవార్ తమను మోసం చేసి రాజ్‌భవన్‌కు తీసుకెళ్లారని వారు ఆరోపించారు. రాజ్‌భవన్‌కు వెళ్లే వరకు తమకు ప్రమాణస్వీకారం గురించి తెలియదన్నారు. ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయడం చూసి తామంతా షాక్ అయ్యామన్నారు.

First Published:  23 Nov 2019 8:41 AM IST
Next Story