ఓడించారని వాటర్ ప్లాంట్ తీసుకెళ్లిన పరిటాల శ్రీరాం
ఇటీవల ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరాం ప్రతిస్పందన విమర్శలపాలవుతోంది. ప్రజలు ఓట్లేయలేదన్న ఆగ్రహంతో పరిటాల కుటుంబం ఉంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినా ఓటేయలేదని దాన్ని తీసుకెళ్లిపోయారు. రాప్తాడు మండలం చాపట్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ గ్రామంలో పరిటాల శ్రీరాంకు ప్రజలు ఓట్లేయలేదు. దాంతో ఆగ్రహించిన పరిటాల వర్గీయులు గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను తీసుకెళ్లిపోయారు. […]
ఇటీవల ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరాం ప్రతిస్పందన విమర్శలపాలవుతోంది. ప్రజలు ఓట్లేయలేదన్న ఆగ్రహంతో పరిటాల కుటుంబం ఉంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినా ఓటేయలేదని దాన్ని తీసుకెళ్లిపోయారు.
రాప్తాడు మండలం చాపట్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ గ్రామంలో పరిటాల శ్రీరాంకు ప్రజలు ఓట్లేయలేదు. దాంతో ఆగ్రహించిన పరిటాల వర్గీయులు గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను తీసుకెళ్లిపోయారు.
వాటర్ ప్లాంట్ యంత్రాలను తీసుకెళ్లి అనంతపురంలోని పరిటాల రవి నివాసంలో ఉంచారు. ఓట్లేయలేదు కాబట్టి పరిటాల శ్రీరాం ఆదేశాల మేరకే వాటర్ ప్లాంట్‌ను తొలగించి తీసుకెళ్లినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. పరిటాల శ్రీరాం తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓట్లేయలేదని వాటర్ ప్లాంట్ తీసుకెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏకాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వ సొమ్ముతో నాడు వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని…ఆ యంత్రాలను ఎలా తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు.