Telugu Global
National

మహారాష్ట్రలో సంచలన పరిణామం... సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణం

మహారాష్ట్రలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవడం, ఉద్దేవ్‌ థాక్రే సీఎంగా ఉంటారని శరద్‌ పవార్ ప్రకటించిన కొన్ని గంటలకే బీజేపీ అనూహ్య రాజకీయం నడిపింది. బీజేపీ నేత ఫడ్నవీస్‌ చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించింది. డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. తమకు మెజారిటీ లేదని అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పిన ఫడ్నవీస్ ఇప్పుడు హఠాత్తుగా సీఎంగా ప్రమాణం […]

మహారాష్ట్రలో సంచలన పరిణామం... సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణం
X

మహారాష్ట్రలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవడం, ఉద్దేవ్‌ థాక్రే సీఎంగా ఉంటారని శరద్‌ పవార్ ప్రకటించిన కొన్ని గంటలకే బీజేపీ అనూహ్య రాజకీయం నడిపింది.

బీజేపీ నేత ఫడ్నవీస్‌ చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించింది. డిప్యూటీ సీఎంగా ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు.

తమకు మెజారిటీ లేదని అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పిన ఫడ్నవీస్ ఇప్పుడు హఠాత్తుగా సీఎంగా ప్రమాణం చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు.

ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అనైతిక రాజకీయాలకు ఈ పరిణామాలే నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇష్టానికి రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నాయి.

బీజేపీ ప్రభుత్వంలో అజిత్ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శివసేనను ఎన్‌సీపీ నమ్మించి ముంచేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామంపై శరద్‌ పవార్‌ స్పందించాల్సి ఉంది.

First Published:  23 Nov 2019 5:46 AM IST
Next Story