Telugu Global
NEWS

కోల్ కతాలో అట్టహాసంగా డే-నైట్ టెస్ట్

క్రీడాదిగ్గజాలతో కళకళలాడిన ఈడెన్ భారత గడ్డపై మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను బెంగాల్ క్రికెట్ సంఘం అట్టహాసంగా ప్రారంభించింది. మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ చారిత్రక టెస్టును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కలిసి…ఈడెన్ గార్డెన్స్ లోని భారీ గంటను మోగించడం ద్వారా ప్రారంభించారు. మ్యాచ్ కు ముందు..60వేల మంది అభిమానులు, మాస్టర్ సచిన్ తో సహా పలువురు క్రీడాదిగ్గజాలతో స్టేడియంలో పండుగ వాతావరణం చోటు చేసుకొంది. మ్యాచ్ ఆరంభానికి […]

కోల్ కతాలో అట్టహాసంగా డే-నైట్ టెస్ట్
X
  • క్రీడాదిగ్గజాలతో కళకళలాడిన ఈడెన్

భారత గడ్డపై మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను బెంగాల్ క్రికెట్ సంఘం అట్టహాసంగా ప్రారంభించింది. మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ చారిత్రక టెస్టును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కలిసి…ఈడెన్ గార్డెన్స్ లోని భారీ గంటను మోగించడం ద్వారా ప్రారంభించారు.

మ్యాచ్ కు ముందు..60వేల మంది అభిమానులు, మాస్టర్ సచిన్ తో సహా పలువురు క్రీడాదిగ్గజాలతో స్టేడియంలో పండుగ వాతావరణం చోటు చేసుకొంది.

మ్యాచ్ ఆరంభానికి ముందు…భారత మాజీ కెప్టెన్లు అనీల్ కుంబ్లే, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, మాజీ క్రికెటర్లు హర్భజన్, లక్ష్మణ్ , సునీల్ గవాస్కర్ తో సహా పలువురు దిగ్గజాలు…గోల్ఫ్ కార్ట్ ల్లో స్టేడియంలో తిరుగుతూ అభిమానులను పలుకరించారు.

2000 సంవత్సరంలో ఈడెన్ వేదికగా బంగ్లా-భారతజట్లు ఆడిన టెస్టులో పాల్గొన్న రెండుదేశాల నాటి క్రికెటర్లను సైతం ప్రత్యేక జ్ఞాపికలతో సత్కరించారు.

మ్యాచ్ మొదటి నాలుగు రోజుల ఆటకు 50వేల టికెట్ల చొప్పున బెంగాల్ క్రికెట్ సంఘం ఇప్పటికే విక్రయించింది. మ్యాచ్ కు ప్రతీకగా కోల్ కతా నగరంలోని హౌరా బ్రిడ్జ్, ఈడెన్ గార్డెన్స్ స్టేడియంతో సహా పలు ల్యాండ్ మార్క్ ప్రాంతాలను గులాబీ రంగుతో అలంకరించడం విశేషం.

First Published:  23 Nov 2019 5:40 AM IST
Next Story