హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రికార్డ్.... 100 కోట్లు వసూలు...
కేంద్రం తెచ్చిన కఠిన మోటారు వాహన చట్టాన్ని తెలంగాణ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. కానీ డ్రంకెన్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలకు ఈ-చాలెన్లను పంపిస్తోంది. అయితే ఇది మహా అయితే 100 నుంచి 2వేల రూపాయలోపే ఉంటాయి. కానీ ఇదే ఇప్పుడు తెలంగాణ సర్కారు కు కాసులు కురిపిస్తోంది. నిజంగా వెల్లడైన విషయం తెలిస్తే మీకళ్లు బైర్లు కమ్ముతాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనల […]
కేంద్రం తెచ్చిన కఠిన మోటారు వాహన చట్టాన్ని తెలంగాణ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. కానీ డ్రంకెన్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలకు ఈ-చాలెన్లను పంపిస్తోంది. అయితే ఇది మహా అయితే 100 నుంచి 2వేల రూపాయలోపే ఉంటాయి. కానీ ఇదే ఇప్పుడు తెలంగాణ సర్కారు కు కాసులు కురిపిస్తోంది. నిజంగా వెల్లడైన విషయం తెలిస్తే మీకళ్లు బైర్లు కమ్ముతాయి.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనల కింద విధించిన జరిమానాల మొత్తం ఎంతో తెలుసా.? అక్షరాల 100 కోట్ల రూపాయలు.. ఈ ఏడాది అక్టోబరు వరకు 100 కోట్ల ఆదాయాన్ని కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా తెలంగాణ సర్కారుకు వచ్చిన రాబడి ఇదీ.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.23కోట్లు, రాచకొండ పోలీసులు రూ.22 కోట్లు, హైదరాబాద్ పోలీసులు 48 కోట్లకు పైగానే జరిమానాల రూపంలో వసూలు చేశారు. ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం జరిమానాల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయడం అంటే ఇదే పెద్ద బిగ్ న్యూస్ గా మారింది.
అయితే ఇతర రాష్ట్రాల్లో జైలు శిక్షలు, పదివేలు, 30 వేలు, లక్షల రూపాయల జరిమానాలను విధిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే స్ట్రిక్ట్ గా కేంద్రమోటార్ వాహనచట్టాన్ని అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరిమానాలు తగ్గించారు. కొందరు జరిమానాలు కట్టలేక వాహనాలే వదిలివెళ్తున్నారు.
కానీ తెలంగాణ పోలీసులు మాత్రం చిన్న జరిమానాలతోనే ఇంత భారీగా 100 కోట్లు కొల్లగొట్టడం అంటే మాటలుకాదు…. ఇదంతా కేవలం హైదరాబాదీల సొమ్మే కావడం గమనార్హం.