లోకేష్ కు నో ఎంట్రీ....
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. ఆరు నెలల కిందటి వరకూ ఆయన ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పుత్రరత్నం… పైగా ఎమ్మెల్సీ, మంత్రి. దీంతో ఎక్కడ సమావేశాలు, సమీక్షలు జరిగినా హాజరయ్యేవాడు. ఆయన కనుసన్నల్లోనే అంతా జరిగేది. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలోనూ లోకేష్ ఆధిపత్యం చెలాయించేవాడు. కానీ ఇప్పుడు మొన్నటి ఓటమి ఆయనకు అధికారాన్ని దూరం చేసింది. నారాలోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని బాగా ఇబ్బందులకు గురిచేసేవారనే […]
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. ఆరు నెలల కిందటి వరకూ ఆయన ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పుత్రరత్నం… పైగా ఎమ్మెల్సీ, మంత్రి. దీంతో ఎక్కడ సమావేశాలు, సమీక్షలు జరిగినా హాజరయ్యేవాడు. ఆయన కనుసన్నల్లోనే అంతా జరిగేది. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలోనూ లోకేష్ ఆధిపత్యం చెలాయించేవాడు. కానీ ఇప్పుడు మొన్నటి ఓటమి ఆయనకు అధికారాన్ని దూరం చేసింది.
నారాలోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని బాగా ఇబ్బందులకు గురిచేసేవారనే పేరుంది. నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట చెల్లకుండా, అధికారులు ఆయన మాట వినకుండా యంత్రాంగాన్ని లోకేష్ నియంత్రించాడన్న వార్తలు కూడా వచ్చాయి. దానికి ప్రతిగానే ప్రతిపక్షంలో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అధికారులకు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపాడు.
అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. లోకేష్ బాబు మంత్రిగా దిగిపోయారు. ఇక మంగళగిరిలో ఓడిపోవడంతో ఆయన ఎమ్మెల్యే కూడా కాదు.. కేవలం ఎమ్మెల్సీ పదవి మాత్రం ఉంది.
లోకేష్ మంత్రిగా గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలకు (డీడీఆర్సీ) సమావేశాలకు ఇన్నాళ్లు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు వైసీపీ సర్కారు ఆయనకు షాకిచ్చింది. ఈసారి డీడీఆర్సీ సమావేశాలకు లోకేష్ ను పిలవకూడదని సమావేశంలో తీర్మానించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం మేరకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు లోకేష్ పాల్గొనకుండా తీర్మానం చేశారు.
ఇలా లోకేష్ మొన్నటివరకు ఆదిపత్యం చెలాయించిన చోటే ఇప్పుడు ఆయనకు ఎంట్రీ లేకుండా చేసి వైసీపీ నేతలు గట్టి షాకే ఇచ్చినట్టైంది.