బాబు భజన బృందనాయకుడు సుజనా... కాల్‌డేటా తీస్తే టీడీపీతో సుజనా లింక్‌లు బయటకొస్తాయి
చంద్రబాబు బతుకంతా యూ టర్న్‌లే అని విమర్శించారు మంత్రి పేర్నినాని. ఎన్నికల ముందు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అంటూ మమతా, స్టాలిన్, దేవేగౌడను కలిసి వచ్చిన చంద్రబాబు… ఎన్నికల తర్వాత ఎందుకు మమతా బెనర్జీ, స్టాలిన్, దేవేగౌడ, సోనియా, రాహుల్ గాంధీ పేర్లు ఎత్తడం లేదని పేర్నినాని ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి మోడీని వదులుకుని తప్పు చేశామంటూ ఇటీవల వ్యాఖ్యానించి మరో యూటర్న్ తీసుకున్నారన్నారు. ఎన్నికల ముందు అమిత్ షాను నోటికొచ్చినట్టు తిట్టి… మొన్న మాత్రం […]
చంద్రబాబు బతుకంతా యూ టర్న్‌లే అని విమర్శించారు మంత్రి పేర్నినాని. ఎన్నికల ముందు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అంటూ మమతా, స్టాలిన్, దేవేగౌడను కలిసి వచ్చిన చంద్రబాబు… ఎన్నికల తర్వాత ఎందుకు మమతా బెనర్జీ, స్టాలిన్, దేవేగౌడ, సోనియా, రాహుల్ గాంధీ పేర్లు ఎత్తడం లేదని పేర్నినాని ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి మోడీని వదులుకుని తప్పు చేశామంటూ ఇటీవల వ్యాఖ్యానించి మరో యూటర్న్ తీసుకున్నారన్నారు.
ఎన్నికల ముందు అమిత్ షాను నోటికొచ్చినట్టు తిట్టి… మొన్న మాత్రం అమిత్ షా పుట్టిన రోజున తండ్రి కొడుకులు పోటీ పడి శుభాకాంక్షలు చెప్పారన్నారు. చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడో దీన్ని బట్టే తెలుసుకోవచ్చన్నారు.
గాజువాకలో పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించి సొంత పార్టీ అభ్యర్థికే వెన్నుపోటు పోడిచారన్నారు. పవన్ కల్యాణ్ కోసమే గాజువాకలో ప్రచారం చేయలేదని ఇటీవల చంద్రబాబే స్వయంగా అంగీకరించారన్నారు.
నిన్నటి వరకు ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకమని మాట్లాడిన చంద్రబాబు… ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియం టీడీపీ హయాంలోనే తెచ్చామని చెబుతున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించడంతో పేద ప్రజలంతా ముఖాన ఉమ్మేస్తున్నారని తెలియగానే… ఇంగ్లీష్‌పైనా చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని పేర్నినాని విమర్శించారు.
”క్రిస్టియన్ స్కూల్‌లో చదువుకున్నాను… క్రిస్టియన్ మతం చాలా గొప్పది… క్రిస్టియన్ స్కూళ్లలోనే దేశభక్తి గురించి నేర్చుకున్నా”నని ఇదే జనసేన అధ్యక్షుడు పవన్ నాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పలేదా అని పేర్నినాని నిలదీశారు.
ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు – వీరు వారు అవుతారని… చంద్రబాబుతో పవన్ ఎంత కాలంగా సహవాసం చేస్తున్నారో గానీ పవన్ నాయుడు కూడా చంద్రబాబు నాయుడులాగే తయారయ్యారన్నారు.
పిల్లిలాంటి చంద్రబాబును పులిగా చూపించడానికి టీడీపీ పత్రికలు జాకీలు పెట్టి తెగ శ్రమపడుతున్నాయన్నారు. కానీ ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేచే అవకాశం లేదన్నారు.
సుజనా చౌదరి పేరుకు బీజేపీలో చేరినా ఆయన చంద్రబాబు భజన బృందానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు. సుజనా చౌదరి లాంటి బ్యాంకు దొంగలను బీజేపీ ఎందుకు తీసుకుందో… ఇలాంటి దొంగల గురించి బీజేపీ ఎప్పుడు తెలుసుకుంటుందో అర్థం కావడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఏ మీడియంలో బోధిస్తున్నారో తెలియదా అని నిలదీశారు. కేంద్రీయ విద్యాలయాల్లో కనీసం తెలుగులో కూడా మాట్లాడనివ్వరని…ఈ విషయం తెలిసి కూడా కన్నా లక్ష్మీనారాయణ, సుజనాచౌదరి లాంటి వారు ఎందుకు నాటకాలు ఆడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
సుజనా చౌదరి పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారో చెప్పాలన్నారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే సొంత పిల్లలను ఎందుకు తెలుగు మీడియంలో చదివించలేదని ప్రశ్నించారు. పేద ప్రజలు వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించుకోవాలంటే సుజనాచౌదరి లాగా బ్యాంకుల్లో లోన్ లు రావని… సుజనాలాగా దొంగ ఆస్తులు పెట్టి లోన్ లు తెచ్చుకునే అవకాశం కూడా పేదలకు ఉండదన్నారు.
బీజేపీ సిద్ధాంతాలతో నడిచే పార్టీగా పేరుండేదని… కానీ సుజనాచౌదరి లాంటి దొంగలంతా చేరిన తర్వాత బీజేపీని కూడా ప్రజలు విమర్శించే పరిస్థితి వచ్చిందన్నారు. సుజనాచౌదరి కాల్ డేటా తీస్తే ఆయన ఏ పార్టీ వారితో ఎక్కువగా మాట్లాడుతున్నారో అర్థమవుతుందన్నారు. బీజేపీలో ఉంటూనే టీడీపీ కోసం పనిచేస్తున్న భజన బృందనాయకుడు సుజనాచౌదరి అని పేర్నినాని విమర్శించారు.
మంచిపాలనతో ప్రజాబలాన్ని నానాటికి పెంచుకుంటున్న జగన్‌ను నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదన్న నిర్ధారణకు వచ్చి ఇప్పుడు మత రాజకీయాలు చేసుకునే స్థాయికి టీడీపీ దిగజారిపోయిందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జెరుసలేం, మక్కా వెళ్లేవారికి డబ్బులు ఇచ్చారని… ఇప్పుడు అదే పని తమ ప్రభుత్వం చేస్తుంటే విమర్శించడం విచిత్రంగా ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అర్చకుల జీతాలు కూడా పెంచారని… కానీ ఆ విషయం చెప్పకుండా ఇతర అంశాలను చంద్రబాబు ప్రచారం చేయించే స్థాయికి దిగజారిపోయారన్నారు.
జగన్ మోహన్ రెడ్డి కులం, మతం, పార్టీ చూడకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్నినాని చెప్పారు. జగన్‌మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గుంట నక్క చంద్రబాబు చాలా ఏళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని… కానీ మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పినట్టుగానే వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెబుతారన్నారు.