Telugu Global
NEWS

కన్యాశుల్కం లో గిరీషం, వెంకటేశంలా తండ్రి కొడుకులు తయారయ్యారు...

కాశం ఉంటే వెంకయ్యనాయుడితో కలిసి అమెరికాలో పుట్టాలని కోరుకుంటాను అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాతృభాష గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు తెలుగు అకాడమి చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. సొంత ప్రాంతంపై కూడా అభిమానం లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తెలుగు మీడియం కావాలని డిమాండ్ చేస్తున్న పెద్దలంతా వారి పిల్లలను తీసుకుని ముందుకొస్తే… వారి కోసం తెలుగు మీడియం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తప్పక ప్రయత్నిస్తారన్నారు. ముందుగా పెద్దలంతా తమ పిల్లలను తెలుగులోనే […]

కన్యాశుల్కం లో గిరీషం, వెంకటేశంలా తండ్రి కొడుకులు తయారయ్యారు...
X

కాశం ఉంటే వెంకయ్యనాయుడితో కలిసి అమెరికాలో పుట్టాలని కోరుకుంటాను అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాతృభాష గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు తెలుగు అకాడమి చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. సొంత ప్రాంతంపై కూడా అభిమానం లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

తెలుగు మీడియం కావాలని డిమాండ్ చేస్తున్న పెద్దలంతా వారి పిల్లలను తీసుకుని ముందుకొస్తే… వారి కోసం తెలుగు మీడియం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తప్పక ప్రయత్నిస్తారన్నారు. ముందుగా పెద్దలంతా తమ పిల్లలను తెలుగులోనే చదివిస్తామంటూ ముందుకు రావాలన్నారు.

పేదలు మాత్రం తెలుగు మీడియంలో చదువుకోవాలి… పెద్దలంతా తమ పిల్లలను ఇంగ్లీష్‌లో చదివించుకోవడం ఏమి నీతి అని ప్రశ్నించారు. చంద్రబాబు గత ఐదేళ్లలో ఏకంగా ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నారాయణ, చైతన్యకు దోచి పెట్టేందుకు ప్రభుత్వ విద్యావ్యవస్థను నాశనం చేశారన్నారు.

ప్రజల మధ్యలో నిలబడి ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను అభ్యుదయ భావాలతో జగన్‌మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. భవిష్యత్తులో తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ ఒక ఐకాన్‌లా నిలిచి తీరుతుందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి విధానాలను అధ్యయనం చేసేందుకు పక్క రాష్ట్రాల వారు ఇక్కడికి వస్తుంటే… చంద్రబాబు మాత్రం తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారన్నారు.

ప్రస్తుత ప్రపంచీకరణలో ఇంగ్లీష్ అవసరం తప్పనిసరి అయిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రతిభ ఉండి కూడా సరైన ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం లేక ఉద్యోగాలు సాధించలేకపోతున్నారన్నారు. తెలుగు మీద చంద్రబాబుకు అంత ప్రేమ ఉంటే ఐదేళ్లు సీఎంగా ఉండి తెలుగు అకాడమీని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు.

కన్యాశుల్కం లో గిరీషం, వెంకటేశం తరహాలో చంద్రబాబు, లోకేష్‌ల వ్యవహారశైలి ఉందన్నారు. ఇంగ్లీష్‌లో చదవడం వల్ల తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నానని చెబుతున్న లోకేష్… తెలుగును పక్కన పెట్టి ఇంగ్లీష్‌లో అనర్గళంగా పది నిమిషాలు మాట్లాడి చూపించాలని సవాల్ చేశారు.

జగన్‌మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని చాలా మంది టీడీపీ నేతలు కూడా ప్రైవేట్ సంభాషణల్లో అభినందిస్తున్నారని… చంద్రబాబు వద్ద ఆ విషయం చెప్పే ధైర్యం లేక పైకి మౌనంగా ఉంటున్నారన్నారు లక్ష్మీపార్వతి.

First Published:  22 Nov 2019 11:06 AM IST
Next Story