‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’... హైకోర్టులో కేఏ పాల్ పిటీషన్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, మత ప్రబోధకుడు అయిన కేఏ పాల్ హైకోర్టుకెక్కారు. వర్మ తాజాగా తీస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్ ని అవమానించేలా చిత్రీకరించారని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదల నిలిపివేయాలని కేఏ పాల్ కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, రాంగోపాల్ వర్మ, జబర్ధస్త్ కమెడియన్ రాము […]
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, మత ప్రబోధకుడు అయిన కేఏ పాల్ హైకోర్టుకెక్కారు. వర్మ తాజాగా తీస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్ ని అవమానించేలా చిత్రీకరించారని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదల నిలిపివేయాలని కేఏ పాల్ కోర్టును కోరారు.
ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, రాంగోపాల్ వర్మ, జబర్ధస్త్ కమెడియన్ రాము పేర్లను చేర్చారు.
కాగా కేఏపాల్ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆయన పిటీషన్ పై విచారణ జరుపనుంది. ఈనెల 29న రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా అంతా సిద్ధమైన తరుణంలో కేఏ పాల్ పిటీషన్ దాఖలు చేయడంతో సినిమా విడుదల విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి.
దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్నటి ఎన్నికల వేళ చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలను ఉద్దేశించి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా రెండు ట్రైలర్లు దుమారం రేపాయి. పోస్టర్లు, ట్రైలర్లు, పాటల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్, ప్రజాశాంతి పార్టీ నేత కేఏపాల్ లను అవమానించేలా చూపించారు.
కమ్మరాజ్యం సినిమాలో తన పాత్ర వైరల్ కావడంతో ఈ విషయంపై కేఏపాల్ స్పందించారు. ఈ మేరకు ఈ సినిమా విడుదలను ఆపివేయాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో సినిమా విడుదలపై పీటముడి నెలకొంది.