Telugu Global
International

ఐదు సంవత్సరాలలో 11 డే-నైట్ టెస్టులు

భారత గడ్డపై మొట్టమొదటి పింక్ బాల్ టెస్ట్ 2015 లో అడిలైడ్ ఓవల్ లో మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ 2017 లో మహిళల తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ క్రేజీ భారత గడ్డపై మొట్టమొదటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కు…. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. మరికొద్దిగంటల్లో బంగ్లాదేశ్ తో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు ముందు డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కథాకమామిషు ఏంటో ఓసారి చూద్దాం…. కంగారూల […]

ఐదు సంవత్సరాలలో 11 డే-నైట్ టెస్టులు
X
  • భారత గడ్డపై మొట్టమొదటి పింక్ బాల్ టెస్ట్
  • 2015 లో అడిలైడ్ ఓవల్ లో మొట్టమొదటి డే-నైట్ టెస్ట్
  • 2017 లో మహిళల తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్

క్రికెట్ క్రేజీ భారత గడ్డపై మొట్టమొదటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కు…. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రంగం సిద్ధమయ్యింది.

మరికొద్దిగంటల్లో బంగ్లాదేశ్ తో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు ముందు డే-నైట్ టెస్ట్ మ్యాచ్ కథాకమామిషు ఏంటో ఓసారి చూద్దాం….

కంగారూల ప్రయోగం డే-నైట్ టెస్ట్….

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు సరికొత్త హంగులు చేకూర్చడంతో పాటు…మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం ఆస్ట్ర్రేలియా 2015లో తొలిసారిగా చేసిన ప్రయోగమే డే-నైట్ టెస్ట్ కమ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.

అడిలైడ్ ఓవల్ వేదికగా న్యూజిలాండ్- ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య ముగిసిన మొట్టమొదటి పింక్ బాల్ టెస్ట్ తో…డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ల శకానికి తెరలేచింది.

1877లో తొలిటెస్ట్- 2015లో తొలి డే-నైట్ టెస్ట్…

ఐదురోజులపాటు జరిగే సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు 14 దశాబ్దాల చరిత్ర ఉంది. మెల్బోర్న్ వేదికగా 1877లో ఆస్ట్ర్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ నిర్వహించిన నాటినుంచి ఇండోర్ వేదికగా గతవారం బంగ్లాదేశ్ తో ముగిసిన తొలిటెస్ట్ వరకూ మొత్తం 2వేల 366 మ్యాచ్ లు జరిగితే అందులో కేవలం 11 డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి.

ఈ మ్యాచ్ ల్లో భారత్ ఆడినవి 538 టెస్టుల వరకూ ఉన్నాయి. అయితే…మరికొద్దిగంటల్లో కోల్ కతా వేదికగా ప్రారంభమయ్యే డే-నైట్ టెస్టుతో …భారత్ ఖాతాలో మొట్టమొదటి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ వచ్చి చేరనుంది.

2015 న అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన మొట్టమొదటి డే -నైట్ టెస్ట్ నుంచి 2019 లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్ర్రేలియా- శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వరకూ కేవలం 11 డే-నైట్ టెస్టులు మాత్రమే జరిగాయి.

టెస్ట్ హోదా పొందిన మొత్తం 11 దేశాలలో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక జట్లకు మాత్రమే డే-నైట్ టెస్టులు ఆడిన అనుభవం ఉంది.

అయితే…ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ మాత్రం తన మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ ఆడటానికి ఐదేళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది.

ఇవీ డే-నైట్ టెస్ట్ రికార్డులు…

ఇప్పటి వరకూ జరిగిన 11 డే-నైట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు పాక్ క్రికెటర్ అజర్ అలీ పేరుతో ఉంది. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ మైకేల్ స్టార్క్ ఉన్నారు.

అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ కమ్ కెప్టెన్ అలీస్టర్ కుక్ నిలిచాడు.

పింక్ బాల్ టెస్టుల్లో ఐదు విజయాలు సాధించిన ఏకైకజట్టు రికార్డు ఆస్ట్ర్రేలియా పేరుతో ఉంది.

ఇవీ డే-నైట్ టెస్ట్ వేదికలు

ఇప్పటి వరకూ జరిగిన డే-నైట్ టెస్టులకు ఆతిథ్యమిచ్చిన వేదికల్లో అడిలైడ్ ఓవల్, బ్రిస్బేన్, బర్మింగ్ హామ్, దుబాయ్, పోర్ట్ ఎలిజబెత్, అక్లాండ్, కెన్సింగ్ టన్ ఓవల్ ఉన్నాయి. ఇప్పుడు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ సైతం ఈ వేదికల సరసన నిలువబోతోంది.

మహిళల మొట్టమొదటి డే-నైట్ టెస్టును 2017 సీజన్లో సిడ్నీ వేదికగా ఆస్ట్ర్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య నిర్వహించారు.

First Published:  21 Nov 2019 6:55 AM IST
Next Story