ప్రేయసి కోసం వెళ్లి పాక్ చెరలోకి...
పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన విశాఖకు చెందిన ప్రశాంత్ కేసులో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశాంత్ ఎనిమిది నెలల క్రితమే పాక్ పోలీసులకు పట్టుబడ్డట్టు చెబుతున్నారు. 2017లోనే ప్రశాంత్ మిస్సింగ్ కేసు నమోదు అయింది. బెంగళూరులోని హువాయ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నికా అనే అమ్మాయిని ప్రశాంత్ ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి ఇతడిని వదిలేసి స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం ప్రశాంత్ పరితపిస్తుండేవాడు. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలన్న […]
పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన విశాఖకు చెందిన ప్రశాంత్ కేసులో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశాంత్ ఎనిమిది నెలల క్రితమే పాక్ పోలీసులకు పట్టుబడ్డట్టు చెబుతున్నారు. 2017లోనే ప్రశాంత్ మిస్సింగ్ కేసు నమోదు అయింది.
బెంగళూరులోని హువాయ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నికా అనే అమ్మాయిని ప్రశాంత్ ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి ఇతడిని వదిలేసి స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం ప్రశాంత్ పరితపిస్తుండేవాడు. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉత్తరభారత్‌లో ఆమె ఆచూకీ దొరుకుంతుందని వెళ్లి.. ఆ ప్రయత్నంలోనే ప్రశాంత్ పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయాడు.
ఎనిమిది నెలల క్రితమే రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరు పోలీసులు ప్రశాంత్ గురించి అడిగి తెలుసుకున్నారని అతడి తండ్రి బాబూరావు వివరించారు. ఆ తర్వాత నెల రోజులకు వచ్చి ప్రశాంత్ పాక్ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారన్నారు. రెండు వారాల క్రితం కోర్టు ఆవరణలో ఒక లాయర్ సాయంతో ప్రశాంత్ తనకు వాట్సాప్ ద్వారా వీడియో పంపించారని ప్రశాంత్ తండ్రి వివరించారు. దీన్నిబట్టి ప్రశాంత్ 8 నెలల నుంచే పాక్ చెరలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.