Telugu Global
National

ఎంపీ రఘురామ కృష్టంరాజు పై జగన్‌ ఫైర్

ఇంగ్లీష్ మీడియం అంశం వైసీపీలోనూ చిచ్చు రేపుతోంది. ఇంగ్లీష్‌ మీడియంపై పార్లమెంట్ వేదికగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ సీరియస్ అయ్యారు. పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. రఘురామ కృష్టంరాజు వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు. ఎంపీ పేరును నేరుగా వెల్లడించకపోయినా సదరు ఎంపీకి క్లాస్ తీసుకోవాల్సిందిగా వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ ఆదేశించారని సాక్షి మీడియా కూడా వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారంతా పేద […]

ఎంపీ రఘురామ కృష్టంరాజు పై జగన్‌ ఫైర్
X

ఇంగ్లీష్ మీడియం అంశం వైసీపీలోనూ చిచ్చు రేపుతోంది. ఇంగ్లీష్‌ మీడియంపై పార్లమెంట్ వేదికగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ సీరియస్ అయ్యారు. పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. రఘురామ కృష్టంరాజు వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు.

ఎంపీ పేరును నేరుగా వెల్లడించకపోయినా సదరు ఎంపీకి క్లాస్ తీసుకోవాల్సిందిగా వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ ఆదేశించారని సాక్షి మీడియా కూడా వెల్లడించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారంతా పేద వర్గాల పిల్లలేనని సీఎం వ్యాఖ్యానించారు. పేద పిల్లల జీవితాలు మారాలన్న ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని జగన్ చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే ఎక్కువగా ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్నారని, వారి జీవితాలను మార్చాలన్న ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం తెస్తున్నట్టు వివరించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు.

ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా మాట్లాడితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని జగన్ స్పష్టం చేశారు.

సాక్షి మీడియా రఘురామ కృష్టంరాజు పేరును నేరుగా ప్రస్తావించకుండా ఒక ఎంపీపై జగన్‌ ఆగ్రహం అంటూ కథనం ప్రసారం చేసింది. మిగిలిన చానళ్లు ఆ ఎంపీ రఘురామ కృష్టంరాజే అని వెల్లడించాయి.

First Published:  19 Nov 2019 4:36 PM IST
Next Story