విశాఖ భూ కుంభకోణం.. సిట్ దర్యాప్తు ముమ్మరం
టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూకుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.టీడీపీ నేతల భూపందేరంపై అప్పటి ప్రతిపక్షం వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలోనే సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంపై తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృదాన్ని వేసింది. ఈ మేరకు సిట్ రంగంలోకి దిగింది. ప్రజలు, బాధితుల నుంచి భూకుంభకోణంపై ఫిర్యాదులు సేకరించడానికి రెడీ అయ్యింది. విశాఖ భూకుంభకోణంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధకు బాధ్యతలు అప్పజెప్పారు. […]
టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూకుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.టీడీపీ నేతల భూపందేరంపై అప్పటి ప్రతిపక్షం వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలోనే సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంపై తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృదాన్ని వేసింది. ఈ మేరకు సిట్ రంగంలోకి దిగింది. ప్రజలు, బాధితుల నుంచి భూకుంభకోణంపై ఫిర్యాదులు సేకరించడానికి రెడీ అయ్యింది.
విశాఖ భూకుంభకోణంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధకు బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఆమె విశాఖ జిల్లాలో ప్రభుత్వ, రాయితీ భూముల రికార్డులు భారీగా అవకతవకలు చేసినట్లు గుర్తించినట్టు తెలిసింది. ఈ మేరకు సబ్ కలెక్టర్లకు ఆధారాలు ఇచ్చి విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ప్రస్తుతం విశాఖ భూ కుంభకోణంపై మొత్తం 2,497 దరఖాస్తులు వచ్చాయని సిట్ ప్రత్యేకాధికారి ఐఏఎస్ అనురాధ తెలిపారు. 13 మండలాల పరిధిలో 1,381 ఫిర్యాదులు, సిట్ రెండో దశలో ఇతర మండలాల్లో 182 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
ఇక ప్రభుత్వం సిట్ విచారణకు సహకారంలో భారీగా రెవెన్యూ అధికారులను నియమించింది. ప్రజల విజ్ఞప్తుల ప్రకారం నివేదిక రూపొందించి ఎవరెవరు పెద్దలు ఈ భూ కుంభకోణంలో ఉన్నారా అని నిగ్గు తేల్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.