Telugu Global
NEWS

ఐదు ఎకరాలు దాటితే రైతు బంధు లేనట్లేనా?

ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. వరికోతలు ప్రారంభమయ్యాయి. కానీ రైతుబంధు సాయం మాత్రం రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. కొందరికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడలేదు. ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్‌ నంబర్లు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ కొందరు రైతుల బ్యాంకు అకౌంట్లలో మాత్రం డబ్బుల జమ కాలేదు. ఎన్నికల ముందు రెండు విడతల్లో ప్రతి రైతు అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. భూమి ఉన్న ప్రతి రైతు సాగుకు దూరం […]

ఐదు ఎకరాలు దాటితే రైతు బంధు లేనట్లేనా?
X

ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. వరికోతలు ప్రారంభమయ్యాయి. కానీ రైతుబంధు సాయం మాత్రం రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. కొందరికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడలేదు.

ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్‌ నంబర్లు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ కొందరు రైతుల బ్యాంకు అకౌంట్లలో మాత్రం డబ్బుల జమ కాలేదు.

ఎన్నికల ముందు రెండు విడతల్లో ప్రతి రైతు అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. భూమి ఉన్న ప్రతి రైతు సాగుకు దూరం కావొద్దన్న ఉద్దేశంతో కేసీఆర్‌ సర్కార్‌ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాకు ఐదు వేల చొప్పున ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు రెండు లక్షల 41వేల 807 మంది రైతులకు ఎకరాకు ఐదు వేల చొప్పున 350 కోట్ల రూపాయల నిధులు అందాల్సి ఉంది. కానీ సీజన్ ముగిసినా 48 వేల 531 మంది రైతులకు 129 కోట్లకు పైగా నగదు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ రైతు బంధు సాయం రాలేదు.

ఐదెకరాల లోపు పొలం ఉన్న రైతులకు రైతు బంధు సాయం అందింది. వారి బ్యాంకుల్లో డబ్బులు జమ అయ్యాయి. ఐదెకరాల పైన ఉన్నవారికి మాత్రం బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని తెలుస్తోంది.

మరోవైపు ఐటీ రిటర్న్‌ కడుతున్నవారు… కారుతో పాటు లగ్జరీ విల్లాలు కొన్నవారికి కూడా రైతు బంధు ఆపేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐదెకరాల పైన ఉన్నవారితో పాటు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కడుతున్నవారికి కూడా రైతు బంధు ఆపేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆధార్‌ కార్డు ఆధారంగా అన్ని వివరాలు సేకరించిన ప్రభుత్వం…వీరికి రైతు బంధు ఆపేశారని తెలుస్తోంది.

మ‌రోవైపు ర‌బీ రైతు బంధు న‌గ‌దు ఇంకా జ‌మ కాలేదు. అక్టోబ‌ర్‌లో వేస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. న‌వంబ‌ర్ చివరి వారం వ‌చ్చింది. అయితే ఇంకా నాట్లు ఊపందుకోలేదు. దీంతో డిసెంబ‌ర్‌లో రైతు బంధు డ‌బ్బులు వ‌స్తాయ‌ని రైతులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

First Published:  18 Nov 2019 10:24 PM GMT
Next Story