తెలుగును ప్రేమించడమే తప్పయితే ఏ శిక్షకైనా సిద్ధం " ఎంపీ రఘురామ కృష్టంరాజు
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా తాను పార్లమెంట్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ జగన్ చేసిన హెచ్చరికలకు రఘురామకృష్ణంరాజు స్పందించారు. తెలుగు భాషను ప్రేమించడం తప్పయితే తాను ఏ శిక్షకైనా సిద్దమని ప్రకటించారు. తెలుగు భాషకు తాను మద్దతిస్తానన్నారు. తెలుగు అకాడమి నిధుల గురించి తాను పార్లమెంట్‌లో మాట్లాడాను గానీ… ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇంగ్లీష్ అన్న పదమే తన […]
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా తాను పార్లమెంట్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ జగన్ చేసిన హెచ్చరికలకు రఘురామకృష్ణంరాజు స్పందించారు.
తెలుగు భాషను ప్రేమించడం తప్పయితే తాను ఏ శిక్షకైనా సిద్దమని ప్రకటించారు. తెలుగు భాషకు తాను మద్దతిస్తానన్నారు. తెలుగు అకాడమి నిధుల గురించి తాను పార్లమెంట్‌లో మాట్లాడాను గానీ… ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇంగ్లీష్ అన్న పదమే తన ప్రసంగంలో రాలేదన్నారు.
తెలుగు కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదు… వైసీపీ ప్రభుత్వం వచ్చాక తెలుగు అకాడమీని ఏర్పాటు చేసిందని చెప్పానన్నారు. అకాడమీకి త్వరగా నిధులు ఇవ్వాలని మాత్రమే కేంద్రాన్ని తాను కోరానన్నారు.
తెలుగు భాష అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఈ అంశంపై తనను ఎవరూ సంజాయిషీ అడగలేదన్నారు. సంజాయిషీ అడిగితే వివరణ ఇస్తానన్నారు. కేవలం మీడియాలో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకునే తాను మాట్లాడుతున్నానని రఘురామ కృష్ణంరాజు వివరించారు.