Telugu Global
NEWS

గ్రీకువీరుడికే ఏటీపీ టూర్ టైటిల్

హోరాహోరీ సమరంలో థీమ్ పై సిటిస్ పాస్ గెలుపు 2019 టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ… ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ను గ్రీస్ ప్లేయర్, 21 సంవత్సరాల స్టెఫానోస్ సిటిస్ పాస్ తొలిసారిగా నెగ్గి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెన్నిస్ లో మొదటి ఎనిమిదిమంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ గత వారంరోజులుగా సాగిన రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీ టైటిల్ ఫైట్ లో సిటిస్ పాస్ మూడుసెట్ల హోరాహోరీ సమరంలో ఆస్ట్ర్రియా ఆటగాడు […]

గ్రీకువీరుడికే ఏటీపీ టూర్ టైటిల్
X
  • హోరాహోరీ సమరంలో థీమ్ పై సిటిస్ పాస్ గెలుపు

2019 టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ… ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ను గ్రీస్ ప్లేయర్, 21 సంవత్సరాల స్టెఫానోస్ సిటిస్ పాస్ తొలిసారిగా నెగ్గి చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ టెన్నిస్ లో మొదటి ఎనిమిదిమంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ గత వారంరోజులుగా సాగిన రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీ టైటిల్ ఫైట్ లో సిటిస్ పాస్ మూడుసెట్ల హోరాహోరీ సమరంలో ఆస్ట్ర్రియా ఆటగాడు డోమనిక్ థీమ్ ను అధిగమించాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో సిటిస్ పాస్ 6-7, 6-2, 7-6తో విజేతగా నిలిచాడు. 2001లో లీటన్ హెవిట్ టూర్ టైటిల్ నెగ్గిన తర్వాత.. అత్యంత పిన్నవయసులో టూర్ టైటిల్ విన్నర్ గా నిలిచిన ప్లేయర్ గా సిటిస్ పాస్ నిలిచాడు.

ఈ విజయంతో స్టెఫానోస్ సిటిస్ పాస్ తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 6వ ర్యాంక్ కు చేరగలిగాడు. 2019 సీజన్లో సిటిస్ పాస్ సాధించిన మొత్తం మూడు టైటిల్స్ లో.. ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిలే అతిపెద్ద విజయం కావడం విశేషం.

నడాల్, జోకోవిచ్ లీగ్ దశలోనే నిష్క్రమించగా…ఆరుసార్లు విన్నర్ రోజర్ ఫెదరర్ సెమీస్ లో పరాజయం పొందాడు.

డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరేవ్ పోటీ సైతం సెమీస్ లోనే ముగిసింది.

First Published:  19 Nov 2019 3:56 AM IST
Next Story